గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వ్యాపారవేత్త మహేష్ సవానీ అనాథలను దత్తత తీసుకుని పెళ్లిళ్లను చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా అనాథలకు అంగరంగ వైభవంగా వివాహం చేశారు. ఈ ఏడాది నిర్వహించిన సామూహిక వివాహ వేడుకలో 300 మంది అనాథ బాలికలకు పెళ్లిళ్లు నిర్వహించారు. వారిలో ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, హిందువులు ఉన్నారు. చాలా మంది అమ్మాయిలకు శనివారం (డిసెంబర్ 4) వివాహం చేశారు. మిగిలిన వారి వివాహం ఆదివారం జరగనుంది. సామూహిక వివాహానికి ముందు మెహందీ వేడుకలు జరిగాయి. 1000 మంది మహిళలకు మెహందీ నిర్వహించారు.
ప్రతి సంవత్సరం, ఈ వ్యాపార కుటుంబం సామూహిక వివాహాన్ని నిర్వహిస్తుందని స్థానికులు తెలిపారు. సూరత్‌లో అనాథ మహిళల ప్రతి సంవత్సరం సామూహిక వివాహాలు నిర్వహిస్తుంటారు. ముగ్గురు ముస్లింలు మరియు ఒక క్రిస్టియన్ జంటతో సహా 135 జంటలకు శనివారం వివాహం జరిగిందని వ్యాపారవేత్త మహేష్ సవానీ తెలిపారు. దత్తత తీసుకున్న తండ్రిగా గత పదేళ్లుగా మహేష్ సవానీ తల్లిదండ్రులను కోల్పోయిన అమ్మాయిల వివాహాల బాధ్యతను స్వీకరిస్తున్నారు. ఈ ఏడాది 300 జంటలకు పెళ్లిళ్లు చేయనున్నారు. ఆయన చేస్తున్న గొప్ప పనులకి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.