బలగాల మనోధైర్యాన్ని దెబ్బతీయకండి.. సుప్రీం సీరియస్
పహల్గామ్ ఘటనపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
By Knakam Karthik
బలగాల మనోధైర్యాన్ని దెబ్బతీయకండి..పహల్గామ్ ఘటనలో పిటిషనర్‌పై సుప్రీం సీరియస్
పహల్గామ్ ఘటనపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ఘటనపై న్యాయ విచారణకు సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది చాలా సున్నితమైన అంశం. ఈ సమయంలో భద్రతా బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దు..అని పిటిషనర్‌కు సుప్రీంకోర్టు హితోపదేశం చేసింది. దేశం పట్ల బాధ్యతాయుతమైన విధిని నిర్వహించండి. మేము దర్యాప్తు చేసే నిపుణులం కాదు. దేశంలో ప్రతి ఒక్కరు చేయి చేయి కలిపి నడువాల్సిన సమయం ఇది అని పిటిషనర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సుప్రీంకోర్టు సూచనతో పిటిషనర్ తన పిల్‌ను వెనక్కి తీసుకున్నారు.
కాగా జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ బైసరన్ లోయలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిపై దర్యాప్తు చేయడానికి జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని పిటిషన్‌లో కోరారు. మరో వైపు పహల్గామ్ ఉగ్రవాద దాడిపై దర్యాప్తు ముమ్మరం కావడంతో NIA చీఫ్ పహల్గామ్ చేరుకున్నారు. ఇటీవల 26 మంది మృతి చెందిన ఉగ్రవాద దాడిపై దర్యాప్తును ఎన్ఐఏ చేపట్టిన తర్వాత ఎన్ఐఏ చీఫ్ సదానంద్ దాతే పహల్గామ్‌ను సందర్శించారు. ఈ బృందం ఆధారాలను సేకరిస్తోంది మరియు ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న వారిని ట్రాక్ చేస్తోంది. దర్యాప్తు ముమ్మరం కావడంతో కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.