అసోంలో భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ యుద్ధ విమానం ప్రమాదానికి గురైంది. జోర్హాట్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే రాడార్‌తో సంబంధాలు తెగిపోయిన ఈ విమానం, కార్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో కుప్పకూలింది. ఈ యుద్ధ విమానం అసోంలోని జోర్హాట్ ఎయిర్‌బేస్ నుండి టేకాఫ్ అయింది. అయితే కొద్దిసేపటికే గ్రౌండ్ కంట్రోల్, రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి.
గాలింపు చర్యలు చేపట్టిన అధికారులకు కార్బీ ఆంగ్లాంగ్ ప్రాంతంలో విమాన శకలాలు లభ్యమయ్యాయి. విమానం ఇక్కడే కుప్పకూలినట్లు నిర్ధారించారు. విమానంలో ఉన్న పైలట్ల పరిస్థితి గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వారు సురక్షితంగా బయటపడ్డారా లేదా అన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఉన్నత స్థాయి దర్యాప్తుకు అధికారులు ఆదేశించారు.