సుకన్య సమృద్ది పథకం.. పీపీఎఫ్‌ ప్రయోజనాలు.. ఇందులో ఏది బెటర్‌..!

Sukanya Samriddhi Yojana Scheme. దీర్ఘకాలిక అవసరాల నిమిత్తం తల్లిదండ్రులు ఈ మధ్య కాలంలో పలు పథకాలలో పెట్టుబడులు

By Medi Samrat  Published on  21 March 2021 2:04 PM GMT
Sukanya Samriddhi Yojana Scheme

దీర్ఘకాలిక అవసరాల నిమిత్తం తల్లిదండ్రులు ఈ మధ్య కాలంలో పలు పథకాలలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఆడ పిల్లలపై, జీవిత బీమా వంటి స్కీమ్‌లను ప్రభుత్వం అమలు చేస్తుండటంతో ఏ పథకాలను ఎంచుకోవాలనే అంశంపై తల్లిదండ్రులు తికమక పడుతుంటారు. ఏ స్కీమ్‌ను ఎంచుకుంటే ఎంలాంటి లాభాలు వస్తాయి..? ఎంత వడ్డీ వస్తుందనే దానిపై ఆరా తీస్తుంటారు. ఇక ప్రత్యేకంగా పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్ (PPF)‌, సుకన్య సమృద్ది యోజన పథకాలను చాలా మంది ఎంచుకుంటారు. అయితే ఇందులో ఏది బెస్ట్ అనేది తెలుసుకుందాం. ఇక తల్లిదండ్రులకు కూతుళ్ల పెళ్లిళ్లు, విద్య అనేవి చాలా ముఖ్యం. ఇందులో సుకన్య సమృద్ది యోజన, పీపీఎఫ్‌లలో ఏది బెటరో చూద్దాం.

సుకన్య సమృద్ది యోజన (ఎస్‌ఎస్‌వై)

2015లో ప్రధాని నరేంద్రమోదీ సుకన్య సమృద్ది యోజన పథకం ప్రారంభించారు. ఈ పథకాన్ని ప్రత్యేకించి బాలికల పొదుపు పథకంగా, దీర్ఘకాలిక పెట్టుబడులకు అత్యంత ప్రజాదరణ పొందిన పథకం ఇది. సాధారణంగా బాలిక పుట్టినప్పటి నుంచి 10 ఏళ్ల వరకు ఈ పథకంలో భాగస్వామ్యం కావచ్చు. అయితే బాలిక తప్పనిసరిగా భారతీయురాలై ఉండాలి. బాలికపై కనీసం రూ.250 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఒక ఏడాది పాటు ఇన్వెస్ట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ పథకం వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ మొత్తంపైనా పన్ను మినహాయింపు ఉంటుంది. మొదట్లో ఈ స్కీమ్‌లో పెట్టుబడిపై 8.4 శాతం వడ్డీరేటు ఉండగా, ఇప్పుడు 7.6కు కుదించారు.

పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌)

ఆదాయ పన్ను మినహాయింపులకు దీర్ఘకాలిక పెట్టుబడి మార్గం ప్రజాదరణ పొందిన స్కీమ్‌ పీపీఎఫ్‌. టాక్స్‌ బెనిఫిట్లతో పాటు అధిక వడ్డీ ఆఫర్‌ చేస్తుంది. పీపీఎఫ్‌ పై వచ్చే వడ్డీ, ఇతర రిటర్నులపై ఆదాయం పన్ను వర్తించదు. గరిష్టంగా 12 వాయిదాల్లో గానీ, ఒకేసారి గానీ భారీ మొత్తంలో పెట్టుబడి స్కీమ్‌ పీపీఎఫ్‌. ఒక ఆర్థిక ఏడాదిలో కనీసం రూ.500 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు అన్వెస్ట్‌ చేసేందుకు అనుమతి ఉంటుంది. పీపీఎఫ్‌ గడువు 15 సంవత్సరాలు. ప్రస్తుతం వడ్డీ రేటు 7.1శాతం వరకు ఉంటుంది.

సుకన్య సమృద్ది-పీపీఎఫ్‌ రెండింటిలో వ్యత్యాసాలు ఏమిటీ..?

సుకన్య సమృద్ది, పీపీఎఫ్‌తో పోలిస్తే పీపీఎప్‌ కంటే సుకన్య సమృద్ది స్కీమ్‌కు ఎక్కువ వడ్డీ రేటు వస్తుంది. పీపీఎఫ్‌ ఇన్వెస్ట్ మెంట్ మంచిదే. బాలిక 21 ఏళ్లు దాటిన తర్వాత సుకన్య సమృద్ది పథకం నిలిపివేయబడుతుంది. పీపీఎఫ్‌ అయితే 15 ఏళ్లకు మెచ్యూర్‌ అయినా, మరో ఐదేళ్లు కొనసాగించే అవకాశం ఉంటుంది. అయితే అయితే సుకన్య సమృద్దిలో 15 సంవత్సరాలు దాటిన తర్వాత పెట్టుబడులు అనుమతించరు. 21 ఏళ్ల తర్వాత మెచ్యూర్‌ అవుతుంది. 18 ఏళ్ల తర్వాత కొన్ని పరిస్థితులను బట్టి విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ రెండు పథకాలకూ ఆదాయం పన్ను చట్టం 80 సీ సెక్షన్‌ కింద మినహాయింపు లభిస్తుంది

నిపుణులు ఏమంటున్నారు..?

కాగా, తల్లిదండ్రులు ఏదో ఒక పథకంలో పెట్టుబడి పెట్టడానికి తరచూ ప్రయత్నిస్తుంటారు. అయిన ఆర్థిక నిపుణులు మాత్రం ఒకే పథకంలో పెట్టుబడి పెట్టవద్దని సూచిస్తున్నారు. చిన్న మొత్తాలు పీపీఎఫ్‌లోనూ ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పీపీఎఫ్‌ కంటే సుకన్యసమృద్ది పథకంలో వడ్డీ ఎక్కువగా రావడంతో చాలా మంది ఈ పథకాన్ని ఎంచుకుంటున్నారు. ఇంకా ఏమైన వివరాలు కావాలని పోస్టాఫీసుల్లో గానీ, ఎస్‌బీఐ బ్యాంకులను సంప్రదించి తెలుసుకోవచ్చు.


Next Story