చిరుతపై దాడి చేసిన వీధి కుక్క.. వీడియో వైర‌ల్‌

మహారాష్ట్రలోని నాసిక్‌లో షాకింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక వీధి కుక్క, చిరుతపులి మధ్య ఘర్షణ జరిగింది.

By Medi Samrat
Published on : 22 Aug 2025 8:44 PM IST

చిరుతపై దాడి చేసిన వీధి కుక్క.. వీడియో వైర‌ల్‌

మహారాష్ట్రలోని నాసిక్‌లో షాకింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక వీధి కుక్క, చిరుతపులి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘ‌ర్ష‌ణ‌లో కుక్క చిరుత‌ను ఓడించింది. కుక్క చిరుతపులిని దవడలతో పట్టుకుని నేల మీద లాక్కొని పోయింది. నిస్సహాయ స్థితిలో ఉన్న‌ చిరుతపులి తప్పించుకోవడానికి ప్రయత్నించింది.

ఈ ఘ‌ర్ష‌ణ‌ ఈ వారం ప్రారంభంలోనే జరిగిందని చెబుతున్నారు. నాసిక్‌లోని నిఫాద్‌లో పొరపాటున ఒక చిరుతపులి జనావాసాల ప్రాంతంలోకి వచ్చింది. అనుకోని అతిథిని చూసిన‌ ఆ ప్రాంతంలోని కుక్కలు అప్రమత్తమ‌వ‌గా.. అందులో ఒక కుక్క చిరుత‌పై దాడి చేసింది.

అయితే.. కుక్కపై దాడికి చిరుత పులి సిద్ధపడలేదు. దీంతో కుక్క చిరుత‌ను పట్టుకుని 300 మీటర్ల దూరం వ‌ర‌కూ లాక్కెళ్లింది. అయితే, ఆ తర్వాత చిరుతపులి తన ప్రాణాలను కాపాడుకుని అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుంది. ఈ ఘటనను ఎవరో వీడియో తీయగా ..ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. గాయపడిన చిరుత సమీపంలోని పొలాల్లోకి వెళ్లిందని స్థానిక అధికారులు తెలిపారు. కుక్క‌ సురక్షితంగా ఉంద‌ని అధికారులు తెలిపారు. అయితే చిరుతపులికి వైద్య సహాయం అవసరమా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

Next Story