బాలికలను టార్గెట్ చేయకండని అంటున్న మిస్ యూనివర్స్

Stop Targeting Girls Let Them Live. హిజాబ్ వివాదంపై మిస్ యూనివర్స్ స్పందించింది. హిజాబ్‌తో సహా అమ్మాయిలను టార్గెట్ చేయడం మానేయాల

By Medi Samrat  Published on  28 March 2022 5:19 AM GMT
బాలికలను టార్గెట్ చేయకండని అంటున్న మిస్ యూనివర్స్

హిజాబ్ వివాదంపై మిస్ యూనివర్స్ స్పందించింది. హిజాబ్‌తో సహా అమ్మాయిలను టార్గెట్ చేయడం మానేయాలని హర్నాజ్ సంధు సమాజానికి విజ్ఞప్తి చేసింది. "వారు ఎంచుకున్న విధంగా జీవించనివ్వండి." అంటూ ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. కర్నాటక హైకోర్టుకు చెందిన ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ఇటీవల విద్యాసంస్థల తరగతి గదుల్లో హిజాబ్ ధరించడానికి అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. హిజాబ్ మతపరమైన ఆచారం కాదని, నిర్దేశించిన విద్యాసంస్థల్లో యూనిఫామ్ దుస్తుల నిబంధనను అనుసరించాలని పేర్కొంది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక క్లిప్‌లో ఒక రిపోర్టర్ హర్నాజ్ సంధును హిజాబ్ గురించి ఆమె అభిప్రాయాలను అడిగారు. మిస్ యూనివర్స్ 2021 గా నిలిచిన తర్వాత హర్నాజ్ కు మార్చి 17న ఘన స్వాగతం పలికారు. అందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో పలు ప్రశ్నలు ఆమెను అడిగారు. అప్పుడు ఆమెకు ఈ ప్రశ్న ఎదురవ్వగా.. ఆమె ప్రశ్నకు ప్రతిస్పందించడానికి ముందు, నిర్వాహకులు జోక్యం చేసుకుని, రాజకీయపరమైన ప్రశ్నలు అడగకుండా ఉండమని విలేఖరిని కోరాడు. ఆమె ప్రయాణం, విజయం మరియు ఆమె ఎలా స్ఫూర్తిదాయకంగా ఉందో అడగాలని మీడియాకు సూచించారు.

హర్నాజ్ మాట్లాడుతూ సమాజంలో అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుంటున్నారని తన వేదనను వ్యక్తం చేసింది. "నిజంగా అడుగుతున్నా ఎప్పుడూ అమ్మాయిలను ఎందుకు టార్గెట్ చేస్తారు? ఇప్పుడు కూడా నన్ను టార్గెట్ చేస్తున్నారు.. హిజాబ్ విషయంలో కూడా అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు.. వాళ్లను (అమ్మాయిలు) వారు ఎంచుకున్న విధంగా జీవించనివ్వండి, అమ్మాయిలను తన గమ్యాన్ని చేరనివ్వండి. వారి రెక్కలని విరిచేయవద్దు" అని సంధు చెప్పింది. ఆమె తన ప్రయాణం, ఆమె ఎదుర్కొన్న అడ్డంకులు, ఈ సంవత్సరం ప్రారంభంలో అందాల పోటీలో సాధించిన విజయాల గురించి అడగమని రిపోర్టర్‌ని కోరింది.














Next Story