రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాల సంస్కృతి పట్ల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉచిత పథకాల గురించి కాదని వాటిని భరించే సామర్థ్యం రాష్ట్రాల బడ్జెట్‍కు లేకపోడవమే అసలు సమస్య అన్నారు. ఉచిత పథకాల కోసం రాష్ట్రాలు అప్పులు చేయడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన చెందుతోందన్నారు. అప్పు తీర్చేందుకు రాష్ట్రాలు మళ్లీ అప్పులు చేయడం సరైన చర్య కాదన్నారు. అయితే రాష్ట్రాలకు నేరుగా నిధులు ఇవ్వకుండా నిపుణుల పరిజ్ఞానం ద్వారా సహకారం అందిస్తున్నామని చెప్పారు. ఖర్చులు, ఆర్థిక వ్యవహారాల శాఖలకు చెందిన అధికారులు రాష్ట్ర ఆర్థిక శాఖలతో కలిసి అప్పుల నిర్మాణాన్ని పునః సమీక్షించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కొన్ని రాష్ట్రాలు ఇకపై తమ రుణాలను తీర్చే పరిస్థితి లేదని దీంతో రాష్ట్రాల పాత, ఖరీదైన రుణాలను వాటి జరిమానాలతో సహా భర్తీ చేయాల్సి రావచ్చని స్పష్టం చేశారు.