ఆగస్టు 9న కోల్‌కతా మహిళా డాక్టర్‌పై జరిగిన దారుణానికి సంబంధించి ప్రధాన నిందితుడు, పౌర వాలంటీర్ సంజయ్ రాయ్‌ను అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలీసులు ఈరోజు సీల్దా కోర్టులో హాజరుపరిచారు. అయితే నందితుడు మళ్లీ న్యాయమూర్తి ఎదుట తాను నిర్దోషినని ప్రకటించుకుని.. రాష్ట్ర ప్రభుత్వం తనను ఇరికించిందని అన్నారు. కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా సంజయ్ రాయ్ మీడియా కెమెరాల ముందు వేడుకుంటూ తానేమీ చేయలేదని.. తనను ఇరికించారని అరిచాడు. తాను నిర్దోషినని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాతో వైరల్ అవుతుంది.
మరోవైపు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని, ఆర్‌జి కర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఎస్‌హెచ్‌ఓ అభిజిత్ మండల్ ప్రమేయం ఉందని పేర్కొంది. గత నెలలో సీబీఐ తొలి చార్జిషీటును కోర్టులో సమర్పించింది. సంజయ్ రాయ్‌తో పాటు సందీప్ ఘోష్, అభిజీత్ మండల్ పేర్లు ఇందులో ఉన్నాయి.
ఇండియన్ జ్యుడీషియల్ కోడ్ సెక్షన్ 103(1), 64 మరియు 66 కింద సంజయ్ రాయ్‌పై అభియోగాలు మోపారు. సందీప్ ఘోష్, అభిజీత్ మండల్ సాక్ష్యాలను నాశనం చేశారని ఆరోపించారు. ఆర్‌జి కర్ ఆసుపత్రిలో ఆర్థిక అవినీతి కేసులో సందీప్ ఘోష్ కూడా నిందితుడు. ఈ ఘటనపై సీబీఐ కూడా విచారణ జరుపుతోంది. మృతి చెందిన మహిళా డాక్టర్ తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలని బీజేపీ ఎమ్మెల్యే, బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారిని అభ్యర్థించారు. ‘మీ సోదరికి న్యాయం జరిగేలా ఏర్పాట్లు చేయండి’ అభ్యర్ధించారు. దీనిపై సువెందు మాట్లాడుతూ.. న్యాయం జరిగే వరకు మృతురాలి తల్లిదండ్రులకు అండగా ఉంటానని తెలిపారు.