కోలీవుడ్ అగ్రనటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ నిర్వహించిన బారీ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగింది. మధురైలో గురువారం సాయంత్రం జరుగుతున్న ఈ సభకు సుమారు నాలుగు లక్షల మంది హాజరు కాగా.. తొక్కిసలాటతో 400మంది అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఒకరు మరణించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.