రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేత‌గా గుర్తించిన స్పీకర్ ఓం బిర్లా

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా బుధవారం రాహుల్ గాంధీని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించారు. లోక్‌సభ సెక్రటేరియట్ బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో

By Medi Samrat  Published on  26 Jun 2024 12:00 PM GMT
రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేత‌గా గుర్తించిన స్పీకర్ ఓం బిర్లా

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా బుధవారం రాహుల్ గాంధీని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించారు. లోక్‌సభ సెక్రటేరియట్ బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో.. భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని జూన్ 9 నుండి లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా అధికారికంగా గుర్తించినట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి గెలిచిన రాహుల్ గాంధీని పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుల జీత భత్యాల చట్టం-1977లోని సెక్షన్ 2 ప్రకారం ప్రతిపక్ష నేతగా గుర్తించారు.

నూతనంగా ఎన్నికైన ఓం బిర్లాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుల‌తో కలిసి స్పీకర్ కుర్చీ వ‌ద్ద‌కు తీసుకెళ్లిన రాహుల్‌ గాంధీ.. ప్ర‌తిప‌క్ష నేత‌గా తనను నియమించినందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ధన్యవాదాలు తెలిపారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు ఖ‌ర్గే, కాంగ్రెస్ నాయకులు, దేశవ్యాప్తంగా ఉన్న ‘బబ్బర్ షేర్’ కార్యకర్తల హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యవాదాలు. మేము పార్లమెంటులో ప్రతి భారతీయుడి వాయిస్‌ని లేవనెత్తుతాము, మన రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాము. NDA ప్రభుత్వ చర్యలకు వారిని బాధ్యులను చేస్తామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

Next Story