సినిమా సీన్ చూసినట్లుగా.. ఆ నాయకుడి కారును లాక్కెళ్లిన ట్రక్కు

SP Leader’s Car Hit And Dragged By Truck For 500 Metres In Mainpuri. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు దేవేంద్ర సింగ్ యాదవ్ కారును

By Medi Samrat  Published on  8 Aug 2022 5:07 AM GMT
సినిమా సీన్ చూసినట్లుగా.. ఆ నాయకుడి కారును లాక్కెళ్లిన ట్రక్కు

ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు దేవేంద్ర సింగ్ యాదవ్ కారును ట్రక్కు ఢీకొట్టింది. సినిమాల్లో చూసినట్లుగా ట్రక్కు ఆ కారును 500 మీటర్ల దూరం లాక్కుని వెళ్ళింది. ఈ ఘటన ఆదివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. ఈ యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. యాదవ్ వాహనాన్ని ఢీకొట్టడానికి ముందు కొంత దూరం వరకూ ట్రక్కు లాక్కుని వెళ్లడం చూడవచ్చు. వాహనం ఆగిన వెంటనే, రోడ్డుపై ఉన్న చాలా మంది సమాజ్‌వాదీ పార్టీ నాయకుడిని రక్షించడానికి స్థానికులు ప్రయత్నించారు.

ఆదివారం రాత్రి యాదవ్ కర్హల్ రోడ్ మీదుగా తన నివాసానికి వెళుతుండగా మెయిన్‌పురి ప్రాంతంలోని భదావర్ హౌస్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన సమయంలో కారులో ఆయన ఒక్కడే ఉన్నారు. యాదవ్ మెయిన్‌పురి సమాజ్‌వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడుగా ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ట్రక్కు డ్రైవర్ ఇటావాకు చెందినవాడు. "సమాజ్‌వాదీ పార్టీ నాయకుడి కారును ట్రక్కు ఢీకొట్టింది, ఆ తర్వాత అది 500 మీటర్లకు పైగా లాక్కు పోయింది. ఇటావాకు చెందిన ట్రక్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. విచారణ కొనసాగుతోంది," అని ఎస్పీ మెయిన్‌పురి కమలేష్ దీక్షిత్ తెలిపారు. ప్రమాదం తర్వాత యాదవ్ మెయిన్‌పురి సదర్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.



Next Story