దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయం లేని కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 31 రైల్వే స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఆయా స్టేషన్ల పరిధిలో ఆదాయం, రద్దీ లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు.
ఫిబ్రవరి 1 నుంచి 29 స్టేషన్లు మూతబడుతుండగా, ఏప్రిల్ 1 నుంచి మరో 2 స్టేషన్లు మూతబడతాయని అధికారులు వెల్లడించారు.అయితే ఈ స్టేషన్లన్నీ కూడా తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో ఉన్నాయని తెలిపారు. ఒక్క స్టేషన్ మాత్రం మహారాష్ట్రలోని నాందేడ్ పరిధిలో ఉందని పేర్కొన్నారు.
డివిజన్ల వారీగా..
సికింద్రాబాద్ పరిధిలో 16, గుంతకల్ పరిధిలో 3, నాందేడ్ పరిధిలో 1,గుంటూరులో 4, హైదరాబాద్‌లో 7 స్టేషన్లను మూసివేయనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. అయితే అకస్మాత్తుగా 31 స్టేషన్లు మూసివేసేందుకు నిర్ణయం తీసుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
కాగా, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న స్టేషన్లపై ప్రత్యేక దృష్టి సారించింది. ఏఏ స్టేషన్లలో ఆదాయం వస్తుంది..ఏఏ స్టేషన్ రద్దీగా ఉంటుందనే దానిపై దృష్టి సారించి తాత్కాలికంగా స్టేషన్‌నుల మూసివేతకు నిర్ణయం తీసుకుంది.