సాయం చేయడం కోసం ఆస్తులు తాకట్టుపెట్టిన గొప్పోడు సోనూ
Sonu Sood mortgages 8 Juhu properties to raise Rs 10 crore for needy. సోనూ సూద్.. లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది అభాగ్యులకు
By Medi Samrat Published on 9 Dec 2020 6:38 PM IST
సోనూ సూద్.. లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది అభాగ్యులకు సాయం చేశాడు. ఆ తర్వాత కూడా అతడు చేసిన సహాయాలను వార్తల్లో చూస్తూనే ఉన్నాం. కొందరు ఏకంగా దేవుడి గదిలో సోనూకు స్థానం ఇవ్వగా.. ఇంకొందరు తమ పిల్లలకు పేర్లు కూడా పెట్టారు. తాజాగా సోనూ తన ఆస్థులను తాకట్టు పెట్టినట్లుగా తెలుస్తోంది.
రూ. 10 కోట్లను పోగు చేయడం కోసం ముంబైలో తనకు గల ఎనిమిది ఆస్థులను ఆయన తాకట్టు పెట్టాడు. ఇందులో ఆరు ఫ్లాట్లు, రెండు దుకాణాలు ఉన్నాయి. ఈ విషయం తెలియగానే సోనూ సూద్ గొప్ప మనసును ప్రతి ఒక్కరూ పొగుడుతున్నారు. లాక్ డౌన్ సమయంలో వలస కూలీలను తమ ఇళ్లకు చేర్చేందుకు రైళ్లు, బస్సులతో పాటు ఏకంగా విమానాలు బుక్ చేసిన సోనూ సూద్ వారికి ఆహారం కూడా అందించారు. ఇక పేదల విద్యార్థులకు చదువులు చెప్పించడం, ఫీజులు చెల్లించడం, ఉద్యోగాలు ఇప్పించడం, ఆనారోగ్యంతో ఉన్నవారికి వైద్యసాయం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు.
సోను సూద్ సెప్టెంబర్‌లోనే ఈ ఆస్తులను స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకుని 10 కోట్ల రుణం తీసుకున్నాడట.. నిజంగా నువ్వు గ్రేట్ బాసూ అని అనాలనిపిస్తుంది సోనూ గొప్ప గొప్పతనం చూస్తే..! లాక్ డౌన్ సమయంలో వలసకూలీలకు అండగా నిలిచాడు సోనూసూద్. దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. విపత్తు మయంలో సోనూ చేసిన సేవా కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఆయన్ని పలు అవార్డులతో సత్కరిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి కూడా సోనూ సూద్ కు పురస్కారాన్ని ప్రకటించింది. సాయం చేయడానికి ఏకంగా తన ఆస్థులను కూడా తాకట్టుపెట్టడంతో సోనూ మరో మెట్టు ఎక్కాడు.