ఢిల్లీ ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ

Sonia Gandhi hospitalised due to Covid-related issues. కోవిడ్ సంబంధిత సమస్యల కారణంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఢిల్లీలోని

By Medi Samrat  Published on  12 Jun 2022 4:50 PM IST
ఢిల్లీ ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ

కోవిడ్ సంబంధిత సమస్యల కారణంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఢిల్లీలోని ఆసుపత్రిలో చేరారని, ఆమె ఆరోగ్యం బాగుందని.. వైద్యుల పర్యవేక్షణలో ఉందని పార్టీ ఆదివారం ప్రకటించింది. "కాంగ్రెస్ అధ్యక్షురాలు, శ్రీమతి సోనియా గాంధీ ఈ రోజు కోవిడ్ సంబంధిత సమస్యల కారణంగా గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆరోగ్యం బాగుంది. పరిశీలన కోసం ఆసుపత్రిలో ఉంచారు." అని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ట్వీట్‌లో తెలిపారు.

ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, ముందుజాగ్రత్తగా ఆసుపత్రిలో ఉంచారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. భారత జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా సోనియా గాంధీని ఆసుపత్రిలో అబ్జర్వేషన్ లో ఉంచారని ట్వీట్ చేశారు. జూన్ 2న సోనియా గాంధీకి కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా, కరోనా కారణంగా ఆమె ఇంటికే పరిమితమయ్యారు. కరోనా సంబంధిత సమస్యలతో ఆమె నేడు ఆసుపత్రిలో చేరారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది





Next Story