కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరోసారి అస్వస్థతకు గురి అయ్యారు. దీంతో వెంటనే ఆమెను ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రి తరలించారు. జ్వరం, ఊపిరితిత్తుల సమస్యతో ఆమె బాధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
సోనియా గాంధీని గురువారమే ఆస్పత్రిలో చేర్పించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపారు. ”సోనియా గాంధీ పరిశీలనలో ఉన్నారు . ఆమె పరిస్థితి నిలకడగా ఉంది” అని ఆసుపత్రి బులెటిన్ లో పేర్కొన్నారు.
కాగా.. ఈ ఏడాది సోనియా ఆస్పత్రిలో చేరడం ఇది రెండో సారి. జనవరిలో వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్‌తో చికిత్స కోసం ఢిల్లీ ఆసుపత్రిలో చేరారు.