కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడటంపై నిషేధం విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. శుక్రవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ, పిల్లలు మొబైల్ ఫోన్ వ్యసనానికి గురికాకుండా కాపాడటమే ఈ చర్య వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
సిద్ధరామయ్య రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇది 17వ సారి. దీంతో కర్ణాటకలో అత్యధిక సార్లు బడ్జెట్‌ను సమర్పించిన నేతగా ఆయన రికార్డు సృష్టించడమే కాకుండా, దేశవ్యాప్తంగా అత్యధిక సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నేతల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నారు.