భువనేశ్వర్ నుంచి రూర్కెలాకు వస్తున్న ఇండియా వన్ ఎయిర్ సెస్నా గ్రాండ్ కారవాన్ ఈఎక్స్ విమానం శనివారం మధ్యాహ్నం 1.40 గంటల ప్రాంతంలో జల్దా కాన్సర్ గడియా టోలీ ప్రాంతంలోని పొలంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో మొత్తం 14 మంది (12 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది) ఉన్నారు.
ప్రస్తుతం గాయాలు, ప్రాణనష్టం గురించి ఎలాంటి సమాచారం లేదు. కోల్‌కతా ATC (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) ద్వారా విమానం యొక్క స్థానం, అత్యవసర ల్యాండింగ్ గురించి రూర్కెలా జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం అందించబడింది.
అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విమానంలో సాంకేతిక లోపం వల్లే ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగిందని చెబుతున్నారు. స్థానిక యంత్రాంగం, పోలీసులు విమానాన్ని చుట్టుముట్టి భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.
ల్యాండింగ్ సమయంలో విమానం ముందు చక్రం పాడైందని, వెనుక రెండు చక్రాలు సురక్షితంగా ఉన్నాయని చెప్పారు. ఈ ప్రమాదంలో పైలట్, ఒక సిబ్బంది సహా మొత్తం ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. అందరినీ ప్రథమ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న వెంటనే రూర్కెలా ఎస్పీ నితీష్ వాద్వానీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డీఐజీ బ్రిజేష్ రాయ్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సంఘటనా స్థలాన్ని పరిశీలించడం ప్రారంభించారు. సమాచారం అందిన వెంటనే ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున జనం గుమిగూడారు.