శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధించిన బంగారు ఆభరణాల చోరీ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక విచారణ బృందం (SIT) ప్రముఖ నటుడు జయరామ్ ను చూడా ప్రశ్నించింది. చెన్నైలోని ఆయన స్వగృహంలోనే ఈ విచారణ జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టితో జయరామ్‌కు ఉన్న పరిచయంపై అధికారులు ఆరా తీశారు.
2019లో చెన్నైలో ఉన్నికృష్ణన్ పొట్టి ఆధ్వర్యంలో జరిగిన ఓ పూజా కార్యక్రమంలో జయరామ్ పాల్గొన్నారు. సిట్ విచారణ అనంతరం జయరామ్ మీడియాతో మాట్లాడారు. కేవలం భక్తితో ఆహ్వానం మేరకే తాను ఆ రోజు పూజలో పాల్గొన్నానని, అంతకు మించి నగలు మాయమైన వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ కేసులో జయరామ్‌ను ఓ సాక్షిగా పరిగణించి ఆయన స్టేట్‌మెంట్‌ను సిట్ రికార్డ్ చేసినట్లుగా తెలుస్తోంది.