సింధ్ నేడు భారత్‌లో భాగం కానప్పటికీ, సరిహద్దులు ఎప్పుడైనా మారవచ్చని, సింధు భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సింధ్‌కు ఉన్న చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యతను గుర్తు చేసుకున్నారు. 1947 విభజన తర్వాత సింధ్ ప్రాంతం పాకిస్థాన్‌కి వెళ్లింది. అక్కడ నివసిస్తున్న చాలా మంది సింధీ హిందువులు భారతదేశానికి వచ్చారు. భారత్ నుంచి సింధు విడిపోవడాన్ని తమ తరంలోని సింధీలు నేటికీ అంగీకరించలేకపోతున్నారని ఎల్‌కే అద్వానీ తన పుస్తకంలో రాశారని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సింధు నది భారతదేశంలోని హిందువులకు ఎల్లప్పుడూ పవిత్రమైనది. సింధ్‌లోని చాలా మంది ముస్లింలు కూడా దాని పవిత్రతను ఆబ్-ఎ-జంజామ్ వలె పవిత్రంగా భావిస్తారని ఆయన చెప్పారు.
భౌగోళికంగా ఈ రోజు సింధ్ భారతదేశంలో ఉండకపోవచ్చు, కానీ నాగరికత, సంస్కృతి ప్రకారం అది ఎల్లప్పుడూ భారతదేశంలో భాగమేనని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సరిహద్దులు మారవచ్చు.. ఎవరికి తెలుసు.. రేపు సింధ్ భారతదేశానికి తిరిగి రావచ్చు అని ఆయన అన్నారు.
మొరాకోలోని భారతీయ సమాజాన్ని ఉద్దేశించి రక్షణ మంత్రి మాట్లాడుతూ.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) ను ఎటువంటి దూకుడు చర్య లేకుండా భారతదేశానికి అప్పగిస్తామని చెప్పారు. పీఓకేలోని ప్రజలు తమ గళాన్ని పెంచడం.. 'స్వేచ్ఛ' కోసం డిమాండ్ చేయడం ప్రారంభించారని ఆయన అన్నారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో కొంతమంది నిపుణులు భారతదేశం ముందుకు సాగాలని, పీఓకేలో కొంత భాగాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పారు. ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ దిశగానే పరిస్థితులు మారుతున్నాయన్నారు.