పంతం నెగ్గించుకున్న సిద్ధూ.. స్టేజి మీదే సిక్సర్ కొట్టినట్లుగా..!

Sidhu hits a sixer as he takes charge of Punjab Congress. ఎట్టకేలకు పంజాబ్ కాంగ్రెస్ లో వివాదాలు పరిష్కారమయ్యాయని కాంగ్రెస్ అధిష్టానం

By Medi Samrat  Published on  23 July 2021 3:54 PM IST
పంతం నెగ్గించుకున్న సిద్ధూ.. స్టేజి మీదే సిక్సర్ కొట్టినట్లుగా..!

ఎట్టకేలకు పంజాబ్ కాంగ్రెస్ లో వివాదాలు పరిష్కారమయ్యాయని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా ఎమ్మెల్యే న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ శుక్ర‌వారం ప‌ద‌వీబాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మానికి త‌న‌కు మ‌ద్ద‌తిచ్చే ఎమ్మెల్యేల‌తో కలిసి కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్‌ కూడా హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మానికి పంజాబ్ పార్టీ వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జ్ హ‌రీష్ రావ‌త్ హాజ‌ర‌య్యారు. త‌న ప్ర‌మాణ స్వీకారానికి రావాల్సిందిగా సిద్ధూ పంజాబ్ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్‌కు రాసిన లేఖ‌లో కోరార‌ని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి.

ఎట్టకేలకు సిద్ధూ పంతం నెగ్గిందని తెలుస్తోంది. సిద్ధూను సిక్సర్ల సిద్ధూ అనే వారన్న సంగతి తెలిసిందే..! సాధారణంగా ఆయన మేనరిజంలో కూడా షాట్ ఆడినట్లు చూపిస్తారు. తాజాగా కూడా సిద్ధూ అలాంటిదే చేసి చూపించారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అయిన త‌ర్వాత కూడా సిక్స్ కొడ‌తాన‌న్న‌ట్లుగా సిద్ధూ స్టేజ్‌పైనే ఓ షాట్ ఆడారు. సీఎం అమ‌రీంద‌ర్ అప్పుడు ఆ ప‌క్క‌నే కూర్చున్నారు. పంజాబ్ పీసీసీ చీఫ్‌గా ప్ర‌మాణం స్వీకారం కార్య‌క్ర‌మంలో సిద్ధూ ఇలా చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

పంజాబ్ సీఎంగా అమ‌రీంద‌ర్‌ను దించాల్సిందే అంటూ పోరాడిన సిద్ధూ చివ‌రికి పీసీసీ చీఫ్ ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. ఆయ‌న‌కు ఈ ప‌ద‌వి ఇవ్వ‌డాన్ని అమ‌రీంద‌ర్ తీవ్రంగా వ్య‌తిరేకించారు. అయితే ఈ ఇద్ద‌రూ శుక్ర‌వారం చాయ్ పే చ‌ర్చ అంటూ త‌మ మ‌ధ్య విభేదాల‌ను ప‌రిష్క‌రించుకునే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌మాణ స్వీకారం చేయాల్సిందిగా త‌న పేరును పిల‌వ‌గానే.. సిద్ధూ నిజంగానే బ్యాటింగ్ చేయ‌డానికి వెళ్తున్న‌ట్లుగా వామ‌ప్ చేస్తూ కుర్చీలో నుంచి లేచి ఓ సిక్స‌ర్ షాట్ ఆడుతున్న‌ట్లుగా చేతులు ఊపారు.


Next Story