ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా ఏ మంత్రి అయినా ఐదేళ్లకు పైగా శిక్ష అనుభవిస్తున్న కేసులో నిందితుడిగా ఉండి, ముప్పై రోజులు జ్యుడీషియల్ కస్టడీలో ఉంటే, అతను తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ బిల్లును హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత లోక్‌సభలో విపక్షాలు గందరగోళం సృష్టించాయి. దీన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీలు ఇది రాజ్యాంగ విరుద్ధ చర్య అని పేర్కొన్నారు. అసదుద్దీన్ ఒవైసీ కూడా దీన్ని వ్యతిరేకించారు.
విపక్షాల వ్యతిరేకత మధ్య అమిత్ షా స్వయంగా తనదైన ఉదాహరణ చెబుతూ.. రాజకీయాల్లో స్వచ్ఛత పాటించాలని, బాధ్యతల నుంచి పారిపోవద్దని సూచించారు. గుజరాత్‌లో మంత్రిగా ఉన్నప్పుడు నాపై ఆరోపణలు వచ్చాయి.. ఆ పదవికి రాజీనామా చేసి కోర్టు ఆదేశాల మేరకు పనిచేశాను.. ఆ తర్వాత ఆ ఆరోపణల నుంచి విముక్తి పొంది రాజ్యాంగం ప్రకారం.. ఆ పదవిని చేపట్టే హక్కు నాకు లభించిందని అమిత్ షా అన్నారు.