బిగ్‌బ్రేకింగ్ : జనవరి 31 వరకు పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించిన సీఎం
Shivraj's major announcements amid rising corona cases. మధ్యప్రదేశ్‌లో జనవరి 31 వరకు పాఠశాలలను మూసివేస్తున్నట్లు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
By Medi Samrat
మధ్యప్రదేశ్‌లో జనవరి 31 వరకు పాఠశాలలను మూసివేస్తున్నట్లు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. జనవరి 15 నుండి 1 నుండి 12వ తరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించారు. కేసుల పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన క్రైసిస్ మేనేజ్‌మెంట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేసుల కట్టడికి అదనంగా మరికొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్రైసిస్ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇందులో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సహా రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. చాలా జిల్లాల్లో టీకాలు వేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోకుండా, ప్రజలు పని చేస్తూనే ఉండేలా కృషి చేస్తున్నామని సీఎం చౌహాన్ చెప్పారు. కొవిడ్ నిబంధనలు పేదలు, రోజువారీ సంపాదకులను ఆందోళనకు గురిచేస్తాయి. అయినా కోవిడ్ నిబంధనలు పాటించాలి. కరోనా పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్, మందులు, థర్డ్ వేవ్ నుండి రాష్ట్ర ప్రజలను రక్షించడానికి ఏర్పాట్లు చేసే బాధ్యతను క్రైసిస్ మేనేజ్‌మెంట్ కమిటీలకు అప్పగించారు. రద్దీ పెరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా కమిటీలదేనని పేర్కొన్నారు.
తీసుకున్న నిర్ణయాలు :-
- జనవరి 15 నుండి జనవరి 31 వరకు పాఠశాలలు మూసివేయబడతాయి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు ఇది వర్తిస్తుంది.
- అన్ని రకాల వాణిజ్య లేదా మతపరమైన సముదాయాలపై నియంత్రణ.
- ఊరేగింపులు, రాజకీయ, సామాజిక సమావేశాలు పరిమితం చేయబడతాయి.
- హాలులో ఉన్న వ్యక్తుల సామర్థ్యంలో 50%తో కార్యక్రమాలు జరిగేలా చూడాలి.
- పెళ్లి లేదా ఇతర ఈవెంట్ హాల్ లేదా ఓపెన్‌లో 250 వరకు సంఖ్య అనుమతించబడుతుంది.
- ప్రేక్షకులు లేకుండా క్రీడా కార్యకలాపాలు జరుగుతాయి.
- ప్రీ-బోర్డు పరీక్షలు జనవరి 20 నుండి జరగాల్సి ఉంది.. వాటి ఫార్మాట్ కూడా మార్చనున్నట్లు పేర్కొన్నారు.