యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ సామ్నా

Shiv Sena targets Yogi govt via Saamana over Lakhimpur Kheri clashes. సామ్నా సంపాదకీయంలో ఈసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోదీలపై

By Medi Samrat  Published on  5 Oct 2021 10:01 AM GMT
యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ సామ్నా

సామ్నా సంపాదకీయంలో ఈసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోదీలపై తీవ్ర విమర్శలు చేశారు. హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న లఖింపూర్‌లో పర్యటించేందుకు అనుమతించకుండా విపక్ష నేతలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకోవడం, సరిహద్దులను మూసివేయడాన్ని శివసేన పార్టీ పత్రిక 'సామ్నా' సంపాదకీయం విమర్శలు గుప్పించింది. యోగి ప్రభుత్వం లఖింపూర్ సరిహద్దులను మూసేసింది. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని ఘటనా స్థలికి వెళ్తుండగా అడ్డుకుని నిర్బంధించారు. ఎంపీ హుడాపై కూడా అనుచితంగా ప్రవర్తించారు. అఖిలేష్ యాదవ్‌ను గృహనిర్బంధం చేశారని సంపాదకీయంలో తెలిపారు.

లఖింపూర్ ఘటనపై ప్రధాని మోదీ మౌనంగా ఉండటాన్ని విమర్శించింది. తాను సున్నిత మనస్కుడే కాకుండా, భావోద్యాగాలు ఉన్న వ్యక్తి అని ప్రధాని మోదీ పలు సందర్భాల్లో చాటుకున్నారు కానీ, లఖింపూర్ ఘటనలో మరణించిన రైతులకు సంతాపం తెలపడపోవడం మాత్రం దిగ్భ్రాంతి కలిగిస్తోందని తెలిపింది. లఖింపూర్ ఘటనపై కంటే షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్టుపైనే మీడియా ఎక్కువగా దృష్టి సారించడాన్ని కూడా శివసేన తప్పుపట్టింది. కేంద్ర మంత్రి తనయుడు నిరసనలు తెలుపుతున్న రైతులను చంపడం కంటే షారూక్ ఖాన్ కుమారుడే మీడియాకు ఎక్కువైందని విమర్శలు గుప్పించింది.


Next Story