పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో శుక్రవారం ఉదయం శివనేత నేత సుధీర్ సూరి హత్యకు గురయ్యారు. గోపాల్ టెంపుల్ సమీపంలోని మజీతా రోడ్డు వద్ద గుర్తుతెలియని వ్యక్తి సుధీర్‌పై కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలారు. ఆలయం వెలుపల ఉద్ధవ్ థాకరే శివసేన వర్గానికి చెందిన కొందరు నేతలు నిరసన తెలుపుతుండగా అక్కడి గుంపులోంచి ఒక వ్యక్తి కాల్పులు జరిపినట్టు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. కాల్పులకు ఉపయోగించిన ఎ.30 పిస్తోల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులు కారు నుంచి దిగి కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. కాల్పుల ఘటన అనంతరం స్థానిక నేతలు నిరసనలకు దిగారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికి నుంచి పంజాబ్‌లో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలినట్టు శివసేన పంజాబ్ అధ్యక్షుడు యోగిరాజ్ శర్మ ఆరోపించారు.
సమాచారం మేరకు దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు అధికారితో మాట్లాడుతున్న సమయంలో శివసేన నేతపై దాడి జరిగింది. సూరి హిట్‌లిస్ట్‌లో ఉన్నాడని, అతడికి ఇప్పటికే భారీ భద్రత కల్పించినట్లు సమాచారం. దాడి చేసిన అనుమానితుడిని గుంపు పట్టుకుంది. తరువాత అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన వ్యక్తిని సందీప్ సింగ్‌గా గుర్తించారు. ఈ ఘటనపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు తజిందర్ సింగ్ బగ్గా స్పందిస్తూ, పంజాబ్‌లో శాంతిభద్రతలు కుప్పకూలాయని, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పంజాబ్‌లో శాంతిభద్రతలు కుప్పకూలాయని విమర్శించారు.