ఏకాంతంలోకి వెళ్తున్న.. మళ్లీ కలుద్దాం: మహారాష్ట్ర ఎంపీ

Shirur MP Amol Kolhe decides to go into 'seclusion'. మానవుడికి ఆరోగ్యం చాలా ముఖ్యమైన విషయం. మనిషి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు

By అంజి  Published on  9 Nov 2021 12:05 PM IST
ఏకాంతంలోకి వెళ్తున్న.. మళ్లీ కలుద్దాం: మహారాష్ట్ర ఎంపీ

మానవుడికి ఆరోగ్యం చాలా ముఖ్యమైన విషయం. మనిషి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. తాజాగా మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణే జిల్లాలోని షిరూర్ నియోజకవర్గానికి చెందిన ఎన్‌సిపి ఎంపి అమోల్ కోల్హే అలాంటి నిర్ణయమే తీసుకున్నారు. మానసిక, శారీరక ఒత్తిడి కారణంగా ఏకాంతానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ''అవలోకనం చేయడానికి ఇదే సరైన సమయం.. గత కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాలుగా నేను తెలియకుండా పరిగెత్తాను, కొన్ని తీవ్రమైన నిర్ణయాలు, ఊహించని చర్యలు తీసుకున్నాను. కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు చాలా ఒత్తిడికి గురయ్యా, టైమ్ మేనేజ్‌మెంట్ చేయాల్సి వచ్చింది. దీంతో నేను మానసికంగా, శారీరకంగా అలసిపోయాను" అని ఎంపి అమోల్‌ కోల్హే సోషల్‌ మీడియా వేదికలో పోస్ట్‌లో రాశారు.

మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు ధ్యానం అవసరమని కోల్హే అన్నారు. గతంలో తీసుకున్న నిర్ణయాల గురించి ఆలోచించవలసి ఉంటుందని.. దాని కోసం ఏకాంతానికి వెళుతున్నానని చెప్పాడు. కొల్హే కొంతకాలం అజ్ఞాతంలో ఉంటానని చెప్పాడు. ఆ తర్వాత కొత్త ఉత్సహంతో మళ్లీ మీ ముందుకు వస్తానని చెప్పాడు. చివరగా చింతన కోసమే చింతన శిబిరానికి వెళ్తున్నానని రాజకీయ శిబిరం కోసం కాదని చమత్కరించాడు. దీనిపై ఎంపీ అమోల్‌ కోల్హే మద్దతుదారులు సానుకూలంగా స్పందిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కోల్హే శివసేన అభ్యర్థి శివాజీరావు అధల్‌ రావు పాటిల్‌పై విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కోల్హే టెలివిజన్‌ సీరియల్‌ 'స్వరాజ్యరక్షక్‌ శంభాజీ'లో ఛత్రపతి శంభాజీ పాత్రను పోషించారు.


Next Story