ప్ర‌ధాని మోదీకి బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హసీనా ధ‌న్య‌వాదాలు

Sheikh Hasina thanks PM Modi for rescuing 9 Bangladeshis from Ukraine.ఉక్రెయిన్ పై ర‌ష్యా చేప‌ట్టిన దాడులు 14

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 March 2022 10:05 AM GMT
ప్ర‌ధాని మోదీకి బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హసీనా ధ‌న్య‌వాదాలు

ఉక్రెయిన్ పై ర‌ష్యా చేప‌ట్టిన దాడులు 14వ‌ రోజు కొన‌సాగుతున్నాయి. బాంబుల మోత‌తో ఉక్రెయిన్ దద్ద‌రిల్లుతోంది. ఎప్పుడు ఏమీ జ‌రుగుతుందో తెలియ‌క ప్ర‌జ‌లు ప్రాణాల‌ను అర‌చేతిలో పెట్టుకుని బ్ర‌తుకుతున్నారు. ఇక ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భార‌తీయుల‌ను సుర‌క్షితంగా స్వ‌దేశానికి తీసుకువ‌చ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఆప‌రేష‌న్ గంగా కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. ఇందులో భాగంగా ఇప్ప‌టికే వేల సంఖ్య‌లో భార‌తీయ‌ విద్యార్థుల‌ను, పౌరుల‌ను ప్ర‌త్యేక విమానాల ద్వారా స్వ‌దేశానికి తీసుకువ‌చ్చారు.

కేవ‌లం భార‌తీయ పౌరుల‌ను మాత్ర‌మే కాకుండా బంగ్లాదేశీయులు, నేపాలీలు, పాకిస్తానీలు, ట్యూనీషియన్లు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తోంది. ఉక్రెయిన్‌లోని సుమీ ప్రాంతంలో చిక్కుకుపోయిన భార‌తీయుల‌ను పోల్తావాకు త‌ర‌లించే చ‌ర్య‌ల‌ను చేప‌ట్టింది. ఈ ఉద‌యం 12 బ‌స్సుల్లో సుమీలోని భార‌తీయుల‌తో పాటు బంగ్లా, నేపాల్ దేశీయుల‌ను పొల్తావాకు త‌ర‌లించారు. ఈ నేప‌థ్యంలో బంగ్లా ప్ర‌ధాని షేక్ హసీనా.. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

భార‌త్‌లా ఏ దేశం చేయ‌లేదు

ఉక్రెయిన్ నుంచి ఒక్క భార‌త‌దేశం మాత్ర‌మే త‌మ పౌరుల్ని వెన‌క్కి ర‌ప్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ అన్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుని సుర‌క్షితంగా ల‌ఖ్‌న‌వూకి చేరుకున్న గోర‌ఖ్‌పూర్‌కు చెందిన విద్యార్థుల‌తో ఆయ‌న మాట్లాడారు. ఇత‌ర దేశాలు త‌మ పౌరుల్ని వారంత‌ట వారిని అక్క‌డే వ‌దిలేసేస్తే భార‌త్ మాత్రం విద్యార్థులు, పౌరుల్ని సురక్షితంగా స్వ‌దేశానికి ర‌ప్పించేలా చ‌ర్య‌లు తీసుకుంద‌న్నారు. ఉక్రెయిన్ మొత్తం 2,290 మంది యూపీ విద్యార్థులు ఉండ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు 2,078 మందిని తీసుకొచ్చిన‌ట్లు వెల్ల‌డించారు.

Next Story