ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనేసిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ మస్క్ కు వార్నింగ్ ఇచ్చారు. భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగాలకు ట్విట్టర్ మద్దతు పలికినా.. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కు ఆటంకం కలిగించినా ట్విట్టర్ కు చెందిన IT కమిటీ చర్య తీసుకోవాలని సూచించారు. ఏ సోషల్ మీడియా సంస్థ ఎవరిది అన్నది ముఖ్యం కాదని కాంగ్రెస్ నేత అన్నారు. ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది ముఖ్యమని తెలిపారు.
-"On Elon Musk: Who owns which social media company is not our concern. What matters is what they do & how. If we find Twitter either interfering w/free speech in India, or the opposite (permitting hate speech &abuse) in our volatile environment, then the IT Committee should take action," అంటూ శశి థరూర్ ట్వీట్ చేశారు.
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ను ఇటీవలే ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్నారు. కొద్దిరోజుల కిందట ట్విట్టర్‌లోని 9.2 శాతం వాటాను కొనుగోలు చేసిన మస్క్ ఇప్పుడు సంస్థ మొత్తం షేర్లను కొనుగోలు చేశారు. ఒక్కో షేర్‌కు 54.20 డాలర్ల చొప్పున సంస్థలోని మొత్తం షేర్లను 46.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి ట్విట్టర్‌ను సొంతం చేసుకున్నారు. వాక్ స్వాతంత్ర్యానికి మరింత అనువైన వేదికగా ట్విట్టర్‌ను తీర్చిదిద్దుతానని ప్రకటించారు.