శశి థరూర్ సెల్ఫీ.. వివాదాలకు కేరాఫ్

Shashi Tharoor trolled for viral pic with women MPs. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ఆరుగురు మహిళా ఎంపీలతో

By Medi Samrat
Published on : 29 Nov 2021 7:01 PM IST

శశి థరూర్ సెల్ఫీ.. వివాదాలకు కేరాఫ్

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ఆరుగురు మహిళా ఎంపీలతో కలిసి అతడు ఉన్న ఫోటోను ట్వీట్‌ చేశారు. అందులో తప్పేముంది అని మీరు అనుకోవచ్చు. ఆయన చేసిన కామెంట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి అయిన థరూర్ తోటి మహిళా ఎంపీల అందచందాలు, ఆకర్షణీయత గురించి కామెంట్ చేయడం వివాదానికి దారితీసింది. "Who says the Lok Sabha isn't an attractive place to work?" అంటూ ట్వీట్ చేశాడు. తీవ్ర వ్యతిరేకత రావడంతో క్షమాపణ చెప్పక తప్పలేదు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన నేపథ్యంలో ఆయన ఆరుగురు మహిళా ఎంపీలతో కలిసి తీసుకున్న సెల్ఫీని శశి థరూర్ ట్వీట్ చేశారు.

లోక్‌సభ ఆకర్షణీయ పని ప్రదేశం కాదని ఎవరు అంటారని ప్రశ్నించారు. దీంతో చాలా మంది ఆయనపై మండిపడ్డారు. ఈ ట్వీట్‌కు జత చేసిన సెల్ఫీలో ఆయనతోపాటు సుప్రియా సూలే (ఎన్‌సీపీ), ప్రెనీత్ కౌర్ (కాంగ్రెస్), తమిళచి తంగపాండ్యన్ (డీఎంకే), మిమి చక్రబర్తి (టీఎంసీ), నుస్రత్ జహాన్ (టీఎంసీ), జోతిమాన్ సెన్నిమలై (కాంగ్రెస్) ఉన్నారు. ఆయన మహిళలపట్ల వివక్షతో వ్యవహరించారని కొందరు ఆరోపించారు. దీంతో శశి థరూర్ వివరణ ఇచ్చారు. మహిళా ఎంపీల చొరవతోనే చాలా సరదాగా ఈ సెల్ఫీ తీసుకున్నట్లు తెలిపారు. ఆ మహిళా ఎంపీలే ఈ ఫొటోను ట్వీట్ చేయాలని తనను కోరినట్లు తెలిపారు. దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నందుకు క్షమించమని అన్నారు.


Next Story