కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక : 30న నామినేషన్ దాఖలు చేయనున్న శశి థరూర్

Shashi Tharoor to file nomination on 30 Sept. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ పార్టీ అధ్యక్ష పదవికి సెప్టెంబర్ 30న నామినేషన్ దాఖలు చేయనున్నారు.

By Medi Samrat  Published on  25 Sept 2022 9:00 PM IST
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక : 30న నామినేషన్ దాఖలు చేయనున్న శశి థరూర్

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ పార్టీ అధ్యక్ష పదవికి సెప్టెంబర్ 30న నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌తో పార్టీ చీఫ్‌ పదవికి పోటీ చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. అయితే అధిస్టానం ప్ర‌క‌టించిన‌ అభ్యర్థితో థరూర్‌తో పోటీ పడాలని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే శనివారం నామినేషన్ ఫారమ్‌లను సేకరించడం ద్వారా తన ఉద్దేశాన్ని స్పష్టం చేశారు.

ఐదు సెట్ల నామినేషన్ పత్రాలను తీసుకున్న శశి థరూర్.. వివిధ రాష్ట్రాలలోని ప్రతినిధులను సంప్రదిస్తున్నారు. ఆయ‌న‌ అభ్యర్థిత్వానికి మ‌ద్ద‌తు తెలిపై 50 మంది ప్రతినిధులు అవసరం. ఇదిలావుంటే.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా పార్టీ అధ్యక్ష పదవికి పోటీలో ఉండకూడదని నిర్ణయించుకోవడంతో.. గాంధీయేతర వ్యక్తి 24 ఏళ్ల తర్వాత అధ్యక్ష పీఠం పైకి రానున్నారు. స్వాతంత్య్రానంతర కాలంలో గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తులు మొత్తం సుమారు 40 ఏళ్లుగా పార్టీకి సారథ్యం వహించారు. స్వాతంత్య్రానంతరం నుంచి ఇప్పటివరకు 16 మంది పార్టీకి నాయకత్వం వహించారు. వారిలో ఐదుగురు గాంధీ కుటుంబానికి చెందిన వారు.

రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించిన 2017-2019 మధ్య రెండేళ్లు మినహా.. 1998 నుండి పార్టీ అధ్యక్షురాలిగా ఎక్కువ కాలం పనిచేసిన సోనియా గాంధీ స్థానంలో కొత్త అధ్యక్షుడు రానున్నందున రాబోయే ఎన్నికలు ఖచ్చితంగా చారిత్రాత్మకమైనవిగా భావిస్తున్నారు.


Next Story