ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఈరోజు పార్టీపై తిరుగుబాటు చేసినందుకు మేనల్లుడు అజిత్ పవార్‌పై మండిపడ్డారు. 'రిటైర్' అవ్వాలని అజిత్ పవార్ చేసిన సూచన మేరకు.. తాను అలసిపోనని.. రిటైర్మెంట్ తీసుకోనని.. తనలో ఇంకా అగ్ని మిగిలి ఉందని అన్నారు. పార్టీ కార్యకర్తలు నన్ను కొనసాగాలని కోరినట్లుగానే తాను పని చేస్తూనే ఉంటానని ఎన్సీపీ అధినేత చెప్పారు. ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మేనల్లుడు అజిత్ అడిగిన ప్రశ్నలన్నింటికీ శరద్ ఏమాత్రం తడుముకోకుండా సమాధానమిచ్చారు.
మొరార్జీ దేశాయ్ ఏ వయసులో ప్రధాని అయ్యారో తెలుసా? నాకు ప్రధానమంత్రి కావాలన్నా, మంత్రి కావాలన్నా ఆలోచన లేదు.. ప్రజలకు సేవ చేయడమే నా కోరిక. నాకు ఇంకా ఆ వయసు రాలేదని అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చెప్పిన మాటలను పవార్ రిపీట్ చేస్తూ.. నేను అలసిపోను, రిటైర్ కూడా కాను. నన్ను రిటైర్ అవ్వమని అడగడానికి అజిత్ ఎవరు? నేను ఇంకా పని చేయగలను అని స్పష్టం చేశారు.
కుటుంబ వారసత్వ పోరులో అజిత్ తన కొడుకు కానందునే పక్కన పెట్టారా అని శరద్ పవార్‌ని ప్రశ్నించగా.. పవార్ మాట్లాడుతూ.. “ఈ విషయంపై నేను పెద్దగా మాట్లడదలచుకోలేదు. కుటుంబ సమస్యలను కుటుంబం వెలుపల చర్చించడం నాకు ఇష్టం లేదు. అజిత్‌ను మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిని కూడా చేశామని, తన కుమార్తె సుప్రియా సూలేకు మంత్రి పదవి ఇవ్వలేదని పవార్ అన్నారు. కేంద్రంలో ఎన్సీపీకి ఎప్పుడు మంత్రి పదవి వచ్చినా ఇతరులకు ఇచ్చారని, ఎంపీగా ఉన్నప్పటికీ సుప్రియకు ఇవ్వలేదన్నారు.