షహీన్ మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం

Shaheen Cyclone. గులాబ్ తుఫాన్ భీభత్సం నుంచి కోలుకోకముందే.. తీరంలో షహీన్ తుఫాన్ వచ్చేసింది.

By Medi Samrat  Published on  1 Oct 2021 2:27 PM GMT
షహీన్ మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం

గులాబ్ తుఫాన్ భీభత్సం నుంచి కోలుకోకముందే.. తీరంలో షహీన్ తుఫాన్ వచ్చేసింది. షహీన్ తుఫాన్ రానున్న పన్నెండు గంటల్లో తీవ్రరూపం దాల్చే పరిస్థితి కనిపిస్తోంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళవద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం అరేబియా సముద్రంపై ఉత్తర-తూర్పు దిశగా పయనిస్తోన్న షహీన్ మరింత ఉధృతీమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భారత సముద్రతీరం నుంచి... షాహీన్ దూరంగా వెళ్ళే సూచనలు కూడా ఉన్నాయని అధికార యంత్రాంగం ఓ ట్వీట్ లో పేర్కొంది.

గుజరాత్ తీరంలో ఈశాన్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పాకిస్తాన్-మక్రాన్ తీరాల వైపు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. గుజరాత్ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. గులాబ్ తుఫాను కారణంగా గుజరాత్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మరో రెండు రోజులపాటు రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండి సూచనలు చేసింది. జామ్‌నగర్, పోర్‌బందర్, ద్వారకా, కచ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.


Next Story