భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు నేడు. పలువురు ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ తన 72వ పుట్టినరోజును జరుపుకోనుండగా, దేశవ్యాప్తంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రపంచ నాయకులు, రాజకీయ నాయకులే కాదు, ప్రముఖులు కూడా చాలా మంది ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్ ప్రధాని మోదీకి బర్త్ డే విషెస్ పోస్ట్ చేశారు. ఒక రోజు సెలవు తీసుకుని ఆ రోజును ఎంజాయ్ చేయమని షారుఖ్ మోదీని అడిగారు.
షారుఖ్ ఖాన్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో "మన దేశం.. దేశ ప్రజల సంక్షేమం కోసం మీ అంకితభావం ప్రశంసించదగినది. మీ అన్ని లక్ష్యాలను సాధించేలా మీకు బలం, ఆరోగ్యం కలిగి ఉండాలి. ఒక రోజు సెలవు తీసుకొని మీ పుట్టినరోజును ఆనందించండి. మీకు జన్మదిన శుభాకాంక్షలు" అని షారుఖ్ చెప్పుకొచ్చాడు. "Your dedication for the welfare of our country and its people is highly appreciated. May you have the strength and health to achieve all your goals. Take a day off and enjoy your Birthday, sir. Happy Birthday @narendramodi (sic)." అని ట్వీట్ చేశాడు షారుఖ్.