భార్యాభర్తల మధ్య బలవంతవు శృంగారం రేప్ కానే కాదు..!
Sexual intercourse between man and wife is not rape even if by force. చట్టపరంగా ఒక్కటైన భార్యాభర్తల మధ్య శృంగారం నేరం కాదని.. బలవంతంగా
By Medi Samrat
చట్టపరంగా ఒక్కటైన భార్యాభర్తల మధ్య శృంగారం నేరం కాదని.. బలవంతంగా సెక్స్ జరిగినా అది రేప్ కాదని చత్తీస్‌ఘడ్ కోర్టు తీర్పులో చెప్పుకొచ్చింది. భర్తది తప్పులేదని చెబుతూ తీర్పును ఇచ్చింది కోర్టు. భార్య కోరికకు విరుద్ధంగా భర్త శృంగారం చేసినా తప్పు కాదు అని.. భార్య వయసు 18 ఏళ్ల లోపు కాకుంటే, అప్పుడు భర్తతో జరిగిన బలవంతపు శృంగారం అత్యాచారం కాదని చత్తీస్‌ఘడ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇటీవల ముంబైలోనూ ఇలాంటి కేసు విచారణకు వచ్చింది. ఆ కేసులో ముంబై అడిషనల్ సెషన్స్ జడ్జి సంజశ్రీ జే ఘారత్ తీర్పునిస్తూ.. భార్యతో భర్త బలవంతపు శృంగారం చేయడం నేరం కాదన్నారు. ఆ కేసును కూడా ఇవాళ చత్తీస్‌ఘడ్ కోర్టు ప్రస్తావించింది. భార్యాభర్తల మధ్య బలవంతపు శృంగారం చట్టవిరుద్ధం కాదని ముంబై కోర్టు తీర్పును ఇటీవలే ఇచ్చింది. ముంబై అడిషనల్ సెషన్స్ జడ్జి సంజశ్రీ జే ఘరత్ ఈ తీర్పు ఇచ్చారు. ఇది చట్టం ముందు నిలబడదని ఆయన స్పష్టం చేశారు.
మహారాష్ర్టకు చెందిన ఓ వ్యక్తితో బాధిత మహిళకు గతేడాది నవంబర్ 22న వివాహమైంది. పెళ్లైన కొద్ది రోజులకు ఆమె భర్త, కుటుంబ సభ్యులు వరకట్న వేధింపులకు గురిచేస్తూ, ఆమెపై ఆంక్షలు విధించారు. వివాహమైన నెల రోజుల తర్వాత తన కోరికకు విరుద్ధంగా భర్త తనతో బలవంతంగా శృంగారం చేసినట్లు బాధిత మహిళ ఆరోపించింది. ఈ ఏడాది జనవరి 2వ తేదీన భార్యాభర్తలిద్దరూ కలిసి మహాబలేశ్వర్‌కు వెళ్లారు. అక్కడ కూడా ఆమెపై బలవంతం చేసినట్లు ఆమె పేర్కొంది. దీంతో ఆమె స్వల్ప అనారోగ్యానికి గురికావడంతో వైద్యున్ని సంప్రదించింది. డాక్టర్ ఆమెను పరీక్షించిన తర్వాత నడుము కింది భాగం పక్షవాతానికి గురైనట్లు నిర్ధారించారు. తన భర్త బలవంతంగా శృంగారం చేయడంతోనే ఈ సమస్య వచ్చిపడిందని ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు కోర్టుకు చేరడంతో విచారణ సందర్భంగా బాధితురాలు తన వాదనను వినిపించింది. దంపతుల మధ్య బలవంతపు శృంగారం చట్టం ముందు నిలబడదని జడ్జి స్పష్టం చేశారు. అయితే ఆమె పక్షవాతానికి గురవడం దురదృష్టకరం అని అన్నారు. ఈ కేసులో కూడా భర్తకు బెయిల్ మంజూరైంది.