నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (NACO) ఇచ్చే సర్టిఫికేట్ ఆధారంగా అడ్రెస్ ప్రూఫ్ లేకున్నా సెక్స్ వర్కర్లకు ఆధార్ కార్డులను జారీ చేస్తామని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సుప్రీంకోర్టుకు తెలియజేసింది. UIDAI దరఖాస్తుదారుని పేరు, లింగం, వయస్సు, చిరునామా వంటి తప్పనిసరి వివరాలను తీసుకుని ఇమెయిల్, మొబైల్ నంబర్‌ను కలిగి ఉండే ఐచ్ఛిక డేటాను సేకరించిన తర్వాత ఆధార్ కార్డ్‌లను జారీ చేస్తుంది.
సెక్స్ వర్కర్ల విషయంలో, UIDAI రెసిడెన్షియల్ ప్రూఫ్‌ను అడగకూడదని, బదులుగా NACO లేదా రాష్ట్ర ఆరోగ్య శాఖ యొక్క గెజిటెడ్ అధికారి ద్వారా సెక్స్ వర్కర్‌కు జారీ చేయగల సర్టిఫికేట్‌ను అంగీకరించాలని నిర్ణయించుకుంది. NACO అనేది కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ క్రింద ఒక విభాగం, సెక్స్ వర్కర్ల కు సంబంధించిన డేటాబేస్ నిర్వహిస్తుంది.
సోమవారం, UIDAI సర్టిఫికేట్ యొక్క ప్రతిపాదిత ప్రొఫార్మాను సుప్రీంకోర్టు ముందు ఉంచినప్పుడు జస్టిస్ L.N నేతృత్వంలోని ధర్మాసనం భారతదేశంలోని సెక్స్ వర్కర్లకు సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించడం, పునరావాస పథకాన్ని రూపొందించడంపై వేసిన పిటిషన్‌ను విచారించారు. 2011 నుంచి ఈ కేసును అత్యున్నత న్యాయస్థానం పర్యవేక్షిస్తోంది. సెక్స్ వర్కర్లపై NACO వద్ద ఉన్న సమాచారాన్ని నివాస రుజువుగా పరిగణించవచ్చో లేదో.. దాని ఆధారంగా వారికి ఆధార్‌ను ఇవ్వవచ్చో పరిశీలించాలని జనవరి 10న కోర్టు ఇచ్చిన ఉత్తర్వుకు ప్రతిస్పందనగా UIDAI అఫిడవిట్ వచ్చింది.