సెక్స్ వర్కర్ ను చంపేశారు.. డీల్ మాట్లాడిన వ్యక్తిపై దాడి.. ఓ క్రైమ్ స్టోరీ

Sex worker killed, middleman injured in firing inside Delhi's brothel, 3 arrested. ఢిల్లీలోని జిబి రోడ్‌లోని వ్యభిచార గృహంలో ఒక సెక్స్ వర్కర్‌ను చంపి, మధ్యవర్తిని గాయపరిచిన

By M.S.R  Published on  1 April 2023 2:42 PM IST
సెక్స్ వర్కర్ ను చంపేశారు.. డీల్ మాట్లాడిన వ్యక్తిపై దాడి.. ఓ క్రైమ్ స్టోరీ

ప్ర‌తీకాత్మ‌క చిత్రం


ఢిల్లీలోని జిబి రోడ్‌లోని వ్యభిచార గృహంలో ఒక సెక్స్ వర్కర్‌ను చంపి, మధ్యవర్తిని గాయపరిచిన ముగ్గురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. మార్చి 7న అందిన ఫోన్ కాల్‌తో ఢిల్లీలోని కమ్లా మార్కెట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసు అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఓ సెక్స్ వర్కర్ (30), మధ్యవర్తి ఇమ్రాన్ (28) నేలపై పడి ఉన్నట్లు గుర్తించారు. బాధితులకు బుల్లెట్ గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు. బాధితులను చికిత్స నిమిత్తం ఢిల్లీలోని లోక్‌నాయక్‌ జై ప్రకాష్‌ నారాయణ్‌ ఆస్పత్రికి తరలించారు. సెక్స్ వర్కర్ కు మెడ వెనుక భాగంలో బుల్లెట్ గాయం కాగా, ఇమ్రాన్ భుజంపై కాల్పులు జరిగాయి. సెక్స్ వర్కర్ తీవ్ర గాయాలపాలై ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు పలు బృందాలను రంగంలోకి దించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించి ఘటనా స్థలం నుంచి పారిపోతున్న ముగ్గురు వ్యక్తులను గుర్తించారు.

నిందితులు ఢిల్లీ నుంచి పశ్చిమ ఉత్తరప్రదేశ్, పంజాబ్ వైపు పారిపోతున్నట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌లలో పోలీసులు నిఘా వేసి కాకా, హ్యాపీ, అనిల్‌ అనే ముగ్గురిని పట్టుకున్నారు. విచారణ అనంతరం హ్యాపీ, కాకా అన్నదమ్ములని.. అనిల్ వారి స్నేహితులు అని తేలింది. పిస్టల్‌తో చోరీ చేసేందుకు ముంబై నగరానికి వచ్చిన వ్యక్తులు, ఆ తర్వాత జిబి రోడ్డుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అక్కడికి చేరుకున్న వ్యక్తులు ఇమ్రాన్‌తో పాటు వ్యభిచార గృహంలో ఉన్న ఇతర వ్యక్తులతో వాగ్వాదానికి దిగారు. ఘర్షణ సమయంలో దుండగులు పిస్టల్‌ తో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అక్కడి నుండి వారు పారిపోయారు.


Next Story