కోర్టు ఆవరణలోకి చిరుతపులి ప్రవేశించి దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు. వివరాళ్లోకెళితే.. బుధవారం మధ్యాహ్నం ఘజియాబాద్ కోర్టు ఆవరణలోకి చిరుత ప్రవేశించి కనీసం ముగ్గురిని గాయపరిచింది. చుట్టుపక్కల వారు తెలిపిన వివరాల ప్రకారం.. చిరుతపులి అకస్మాత్తుగా కోర్టు వద్దకు చేరుకుంది. ప్రజల భద్రతకై కోర్టు ఆవరణలో చిరుతకై వెతకటంతో గందరగోళం నెలకొంది. ఈ గొడవను చూసిన చిరుతపులి.. దూకుడు పెంచి కోర్టు ఆవరణలో బూట్లు రిపేర్ చేస్తున్న చెప్పులు కుట్టే వ్యక్తిని, మరో వ్యక్తిని గాయపరిచింది. పార, కర్ర సాయంతో చిరుతను తరిమికొట్టేందుకు వెళ్లిన లాయర్‌పై కూడా చిరుత దాడి చేసింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ బృందం చిరుతను రక్షించేందుకు కోర్టుకు చేరుకుంది. చిరుతపులి పట్టుకునేందుకు అటవీ శాఖ బృందం ప్రయత్నాలు ప్రారంభించింది.