బయటకొచ్చిన‌ గురు శివశంకర్ బాబా దారుణాలు

Self-styled guru Shiv Shankar Baba booked after sexual abuse complaints. ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకుంటున్న శివశంకర్

By Medi Samrat  Published on  13 Jun 2021 3:18 PM GMT
బయటకొచ్చిన‌ గురు శివశంకర్ బాబా దారుణాలు

ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకుంటున్న శివశంకర్ బాబా చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. తమిళనాడులోని చెన్నై సమీపంలోని కేలంబక్కం లోని తన విద్యా సంస్థలో పాఠశాల విద్యార్థులను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శివశంకర్ బాబాపై పోలీసులు కేసు నమోదు చేశారు. చెన్నై పోలీసులు ఆదివారం నాడు అతడిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.

కీలంబాక్కంలో తన స్కూలుకు చెందిన పలువురు విద్యార్థినులను ఈ బాబా లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. సుశీల్ హరి ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్లో చదివిన పలువురు విద్యార్థులు శివశంకర్ బాబాపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. వారి ఫిర్యాదులపై చర్యలు తీసుకోడానికి శివ శంకర్ బాబాను చైల్డ్ వెల్ ఫేర్ కమిటీ పిలిపించింది, కాని అతను హాజరుకాలేదు. తమ గురువు ఛాతీ నొప్పితో బాధపడుతున్నాడని, డెహ్రాడూన్లోని ఆసుపత్రిలో చేరాడని శివశంకర్ బాబా బృందం తెలిపింది. శివశంకర్‌ బాబా సుశీల్ హరి పేరిట ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్‌ను నిర్వహిస్తున్నాడు. స్కూల్‌లో చదివిన పలువురు విద్యార్థినులు బాబా తమపట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేగాక ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు.

చైల్డ్ వెల్ ఫేర్ కమిటీ శివశంకర్ బాబాకు సమన్లు జారీ చేసింది. ముగ్గురు విద్యార్థినులు చేసిన ఫిర్యాదుతో కీలంబాక్కం మహిళా పోలీసులు శివశంకర్ బాబాపై పోక్సో చట్టం కింద పలు కేసులు దాఖలు చేశారు. కేసు తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం దీన్ని సీబీసీఐడీకి ట్రాన్స్ ఫర్ చేసింది. కేసుకు సంబంధించి సమాచారం పొందడానికి ఇద్దరు మైనర్లతో పాటు మొత్తం 13 మంది బాధితులను అధికారులు కలిసి వివరాలు సేకరించనున్నారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా కీలంబాక్కం పోలీసులు శివశంకర్ బాబాపై కేసు నమోదు చేశారు. ఐపిసి 354, 363,365, 366 సెక్షన్ల కింద అభియోగాలు, పోక్సోలోని పలు విభాగాల ప్రకారం అతనిపై కేసులు నమోదు చేశారు.


Next Story
Share it