క‌ర్ణాట‌క ఎన్నిక‌లు.. కొన‌సాగుతున్న‌ ప్రధాని మోదీ మెగా రోడ్ షో

Sea of supporters in PM Modi’s 26-km roadshow in Bengaluru. మే 10న కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది.

By Medi Samrat  Published on  6 May 2023 11:46 AM IST
క‌ర్ణాట‌క ఎన్నిక‌లు.. కొన‌సాగుతున్న‌ ప్రధాని మోదీ మెగా రోడ్ షో

మే 10న కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. అన్ని పార్టీలు తమ పూర్తి బలాన్ని ప్ర‌ద‌ర్శించేందుకు క‌స‌ర‌త్తులు చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే బీజేపీ త‌ర‌పున‌ ప్రధాని నరేంద్ర మోడీ రంగంలోకి దిగారు. ప్ర‌చారానికి కర్ణాటక చేరుకున్న ఆయ‌న‌ మెగా రోడ్ షో ప్రారంభించారు. బెంగళూరులో ప్రధాని మోదీ రోడ్‌షో ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. 17 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా ఆయన రోడ్ షో సాగనుంది. వేలాది మంది ప్రజలు ర్యాలీలో పాల్గొనేందుకు వ‌చ్చారు. ప్రధాని ర్యాలీలో జై బజరంగబలి నినాదాలు మార్మోగాయి. ప్రధాని మోదీ రోడ్‌షో 26 కిలోమీటర్ల మేర‌ కొనసాగనుంది. ప్రధాని మోదీని చూసేందుకు ఉదయం నుంచి పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నారు. బెంగళూరులో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన‌ ప్రధాని మోదీ రోడ్‌షో మధ్యాహ్నం 1.30 వరకు కొనసాగనుంది. ఈ రోడ్ షోలో 10 లక్షల మందికి పైగా పాల్గొంటారని అంచనా.



Next Story