10 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌.. స్కూల్‌కు సీల్‌ వేసిన అధికారులు

School Sealed As Teacher, 10 Students Test Covid +ve. జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. ఓ పాఠశాలలో 10 మంది విద్యార్థులు, ఒక టీచర్‌కి కోవిడ్-19కి పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది.

By అంజి
Published on : 12 Dec 2021 9:07 AM

10 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌.. స్కూల్‌కు సీల్‌ వేసిన అధికారులు

కర్ణాటకలోని చిక్కమంగళూరు జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. ఓ పాఠశాలలో 10 మంది విద్యార్థులు, ఒక టీచర్‌కి కోవిడ్-19కి పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో పాఠశాల భవనాన్ని మూసివేసి, కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. చిక్కమంగళూరులోని జీవన్ జ్యోతి హైస్కూల్‌లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందితో సహా మొత్తం 470 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు చిక్కమగళూరు జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ ఉమేష్ తెలిపారు. 11 మంది ఫలితాలు పాజిటివ్‌గా వచ్చినట్లు వారు తెలిపారు. కరోనా సోకిన వారందరూ లక్షణరహితంగా ఉన్నారని, హోమ్ క్వారంటైన్‌లో ఉంచబడ్డారని ఆయన తెలియజేశారు. పరిస్థితిని పర్యవేక్షించడానికి పాఠశాలలో వైద్య శాఖ అధికారులను నియమించారు. రాష్ట్రంలోని అనేక పాఠశాలలు విద్యార్థులు, సిబ్బందిలో కరోనావైరస్ కేసుల పెరుగుదల కనిపిస్తున్న.. రెగ్యులర్ ఆఫ్-లైన్ తరగతులు కొనసాగుతున్నాయి.

కర్ణాటక ప్రాథమిక, మాధ్యమిక విద్యా శాఖ మంత్రి బిసి నగేష్ ఇటీవల మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగితే ప్రభుత్వం పరీక్షలు, పాఠశాలలను నిలిపివేయడం నుండి వెనక్కి తగ్గదని, అయితే రెగ్యులర్ ఆఫ్‌లైన్ తరగతులను నిర్వహించడంలో సమస్య లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారని ఆయన అన్నారు. బెంగళూరు రూరల్, మైసూరు, చిక్కమంగళూరులోని రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులలో చాలా మందికి కరోనా మహమ్మారి సోకింది. గత వారం చిక్కమంగళూరులో జవహర్ నవోదయ విద్యాలయంలోని 59 మంది విద్యార్థులతో సహా కనీసం 69 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. కర్ణాటకలో శనివారం మొత్తం 320 కొత్త కొవిడ్‌-19 కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి.

Next Story