భారతీయ జనతా పార్టీ మాజీ నాయకురాలు నూపుర్ శర్మపై దేశవ్యాప్తంగా నమోదైన 10 కేసులపై విచారణను ఢిల్లీ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలిచ్చింది. ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలువురు ఆమెపై ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. తనపై నమోదైన అన్ని కేసులను ఒకే చోట విచారించే విధంగా ఆదేశాలివ్వాలని నూపుర్ శర్మ సుప్రీంకోర్టును కోరారు.
నూపుర్ శర్మ మే నెలలో ఓ టీవీ చర్చా కార్యక్రమంలో మాట్లాడారు. అప్పట్లో ఆమె బీజేపీ అధికార ప్రతినిధిగా ఉండేవారు. మహమ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలతో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది. పాకిస్థాన్, కతార్, వంటి 14 ముస్లిం దేశాలు తమ అభ్యంతరాన్ని తెలిపడంతో ఆమెను బీజేపీ సస్పెండ్ చేసింది.