నేను మోదీ పాత్రను చేయను

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్‌లో తాను నటించనున్నట్టు వస్తున్న వార్తలను తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ ఖండించారు.

By M.S.R  Published on  23 May 2024 9:43 AM IST
నేను మోదీ పాత్రను చేయను

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్‌లో తాను నటించనున్నట్టు వస్తున్న వార్తలను తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ ఖండించారు. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానున్న కొత్త బయోపిక్‌లో ప్రధాని మోదీ పాత్రను పోషించేందుకు తాను ఎలాంటి అంగీకారం చెప్పలేదని సత్యరాజ్ అన్నారు. మోదీ పాత్రలో నటించేందుకు తనను ఎవరూ సంప్రదించలేదని కూడా సత్యరాజ్‌ వివరించారు. అంతేకాదు.. నిర్మాతలు తనను సంప్రదించినా, మోదీ పాత్రలో నటించడానికి తాను అసలు అంగీకరించనని కూడా అంటూ ఘాటుగా చెప్పుకొచ్చారు. అలాంటి సినిమా తన భావజాలానికి చాలా దూరమని అన్నారు.

సత్యరాజ్ తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటులు. “మిర్చి”, “బాహుబలి” వంటి చిత్రాలతో తెలుగులో కూడా మంచి పాపులారిటీని తెచ్చుకున్నాడు. "బాహుబలి" చిత్రంలో కట్టప్ప పాత్రను పోషించిన తర్వాత సత్యరాజ్ భారతదేశంలోనే పాపులర్ నటుడు అయ్యారు. అలాంటి ఆయనను మోదీ బయోపిక్ లో నటించమని అడిగినట్లుగా గత కొద్దిరోజులుగా మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని సత్యరాజ్ తేల్చి చెప్పారు.

Next Story