ఆశల పల్లకిలో శశికళ వర్గం..!

Sasikala Latest News. శశికళ జైలుకు వెళ్లినప్పటి నుండి ఆమె వర్గం ఎంతో డీలా పడిపోయిన సంగతి తెలిసిందే..!

By Medi Samrat  Published on  30 Dec 2020 9:00 AM GMT
ఆశల పల్లకిలో శశికళ వర్గం..!

శశికళ జైలుకు వెళ్లినప్పటి నుండి ఆమె వర్గం ఎంతో డీలా పడిపోయిన సంగతి తెలిసిందే..! చిన్నమ్మ బయటకు వస్తే తమిళనాడులో మరోసారి చక్రం తిప్పొచ్చు అని శశికళ బ్యాచ్ ఎదురుచూస్తూ ఉంది. గతంలో కూడా పలు మార్లు శశికళ విడుదలకు సంబంధించిన వార్తలు వచ్చాయి. కానీ అవేవీ జరగలేదు. ఎట్టకేలకు జనవరి 27న శశికళ బయటకు వస్తుందని భావిస్తూ ఉన్నారు.

అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం వర్గాలు శశికళ బ్రహ్మరథం పట్టే రీతిలో ఆహ్వాన ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. అక్రమాస్తుల కేసులో పరప్పన అగ్రహార చెరలో ఉన్న శశికళ ముందస్తు విడుదల విషయాన్ని కర్ణాటక జైళ్లశాఖ వర్గాలు పరిశీలనలో ఉంచాయి. చిన్నమ్మ ముందుస్తు విడుదల జరగదని, శిక్షాకాలం ముగియగానే జనవరి 27న విడుదల అవ్వబోతోందని అంటున్నారు. ఇందులో మార్పు ఉండదని అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం వర్గాలు చెబుతున్నాయి.

చిన్నమ్మ రాకపై సమావేశం నిర్వహించారు. ఆహ్వాన ఏర్పాట్లపై దృష్టి పెట్టమన్నారు. జనవరి 27న చిన్నమ్మ జైలు నుంచి బయటకు రావడం ఖాయమని, నేరుగా మెరీనా తీరానికి వెళ్లి అమ్మ జయలలిత సమాధి వద్ద శపథం చేయనున్నారని, ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్తారని చిన్నమ్మ సన్నిహితులు చెబుతున్నారు.

పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదల కావడం ఖాయమని భావిస్తున్న అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అభిమానులు, ఆమెకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సమావేశమైన ఆమె అనుచరులు, ఆమెకు స్వాగతం పలికేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న విషయమై క్లారిటీతో ఉన్నారు. చిన్నమ్మకు స్వాగతం పలుకుతూ 65 చోట్ల ఆహ్వాన సభలను నిర్వహించాలని నిర్ణయించామని, ఈ ఏర్పాట్లపై దృష్టి పెట్టామని అంటున్నారు చిన్నమ్మ అభిమానులు.


Next Story
Share it