వాట్సాప్ కు పోటీగా సందేశ్..!

Sandes app Better WhatsApp alternative. భారతప్రభుత్వం విదేశీ యాప్ ల కంటే స్వదేశీ యాప్ ల మీదనే ఎక్కువగా ఆధారపడాలని భావిస్తున్న

By Medi Samrat  Published on  19 Feb 2021 2:27 PM GMT
వాట్సాప్ కు పోటీగా సందేశ్..!

భారతప్రభుత్వం విదేశీ యాప్ ల కంటే స్వదేశీ యాప్ ల మీదనే ఎక్కువగా ఆధారపడాలని భావిస్తున్న సంగతి తెలిసిందే..! అందుకే ప్రభుత్వం పలు స్వదేశీ యాప్స్ ను తీసుకుని వస్తోంది. వాట్సాప్ కు పోటీగా సందేశ్ యాప్ ను సాధారణ ప్రజల కోసం తీసుకుని వచ్చింది భారత ప్రభుత్వం. ప్రభుత్వ విభాగాల మధ్య సమాచార మార్పిడికి ఉద్దేశించిన సందేశ్ యాప్ ను కేంద్ర ప్రభుత్వం ఇకపై సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది.

గతంలో దీన్ని జిమ్స్ అని పిలిచేవాళ్లు. జిమ్స్ అంటే గవర్నమెంట్ ఇన్ స్టాంట్ మెసేజింగ్ సిస్టమ్ అని అర్థం. దీన్ని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) అభివృద్ధి చేసింది. జిమ్స్ యాప్ లో పలుమార్పులు చేసిన ఎన్ఐసీ సందేశ్ గా మార్చి ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది. సందేశ్ యాప్ ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు పోటీ ఇస్తుందని కేంద్ర వర్గాలు భావిస్తున్నాయి. ఆండ్రాయిడ్ యూజర్లు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే నేరుగా జిమ్స్ వెబ్ సైట్ కు వెళ్లి దానికి సంబంధించిన ఏపీకేని ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐఓఎస్ యూజర్లు యాప్ స్టోర్ నుంచి దీన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఫోన్ నెంబరు సాయంతో సందేశ్ యాప్ లో ఖాతా ప్రారంభించి సేవలు పొందవచ్చు. ప్రభుత్వ అధికారిక మెయిల్ ఐడీలు ఉన్నవాళ్లు మాత్రమే మెయిల్ ఐడీ సాయంతో సందేశ్ ఖాతాలు ప్రారంభించవచ్చు. జీమెయిల్, యాహూ వంటి ప్రైవేటు డొమైన్ మెయిల్ ఐడీలకు సందేశ్ యాప్ అనుమతి ఉండదు. వాట్సాప్ అందించే సేవలన్నింటిని సందేశ్ అందిస్తుందని అధికారులు తెలిపారు. ఇక ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ భద్రత కూడా కల్పిస్తున్నారు.
Next Story
Share it