డ్రగ్స్‌ వ్యాపారంలో సమీర్‌ వాంఖడే మరదలు.. నవాబ్‌ మాలిక్‌ ఆరోపణలు.!

Sameer Wankhede if his wife's sister is involved in drug business. ముంబై డ్రగ్స్‌ కేసును మొదట్లో విచారించిన సమీర్‌ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ తన విమర్శలు ఆపడం లేదు.

By అంజి  Published on  8 Nov 2021 11:49 AM IST
డ్రగ్స్‌ వ్యాపారంలో సమీర్‌ వాంఖడే మరదలు.. నవాబ్‌ మాలిక్‌ ఆరోపణలు.!

ముంబై డ్రగ్స్‌ కేసును మొదట్లో విచారించిన సమీర్‌ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ తన విమర్శలు ఆపడం లేదు. ముంబై ఎన్‌సీబీ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే ఆరోపణల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. క్రూయిజ్‌ నౌకలో ఏర్పాటు చేసిన పార్టీ పేరుతో షారుకుఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ను కిడ్నాప్‌ చేసే ప్రయత్నం జరిగిందన్నారు. ఇందుకు కీలక సూత్రధాని సమీర్‌ వాంఖడే అని మాలిక్‌ నిన్న సంచలన ఆరోపణలు చేశాడు. డ్రగ్స్‌ వ్యాపారంలో సమీర్‌ వాంఖడే మరదలు హర్షదా దీనానత్‌ రేడ్కర్‌కు సంబంధముందని తాజాగా ఆరోపణలు చేశాడు. ఈ విషయమై ఎన్‌సీబీ అధికారి సమీర్‌ వాంఖడే సమాధానం చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. 2008లో నమోదైన డ్రగ్స్‌ అక్రమ రవాణా కేసు వాంఖడే భార్య క్రాంతీ రేడ్కర్ సోదరి హర్షదా పేరు ఉంది. ఈ కేసును ఆధారంగా చేసుకునే మంత్రి నవాబ్‌ మాలిక్‌ ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది.

సమీర్‌ వాంఖడే.. మీ మరదలు హర్షదా దీనానత్‌ రేడ్కర్‌ డ్రగ్స్‌ వ్యాపారం చేశారా? అంటూ నవాబ్‌ మాలిక్‌ ప్రశ్నించారు. దీనికి మీరు తప్పనిసరిగా సమాధానం చెప్పాలని.. ఎందుకంటే ఆమె కేసు పుణె కోర్టులో పెండింగ్‌లో ఉందని నవాబ్‌ మాలిక్‌ అన్నారు. అయితే ఈ ఆరోపణలను వాంఖడే తోసిపుచ్చుతూ.. 2008లో తాను ఇంకా సర్వీసులోకే రాలేదని అన్నారు. క్రాంతి రేడ్కర్‌ను తాను 2017లో పెళ్లి చేసుకున్నానని వాంఖడే తెలిపారు. మంత్రి నవాబ్‌ మాలిక్‌ ఆరోపణలు చేస్తున్న కేసుతో నతకు ఎలాంటి సంబంధం లేదన్నారు. మరోవైపు మంత్రి నవాబ్‌ మాలిక్‌పై వాంఖడే తండ్రి ధ్యాన్‌దేవ్‌ బాంబే హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. తమ మత విశ్వాసాలను అవమానిస్తూ మాలిక్‌ ఆరోపణలు చేస్తున్నారని పిటిషన్‌ పేర్కొన్నారు. మంత్రి నవాబ్‌ మాలిక్‌పై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.

Next Story