దీపావళి టపాసులను బ్యాన్‌ చేయొద్దన్న సద్గురు జగ్గీ వాసుదేవ్.!

Sadhguru says let children burst firecrackers. దీపావళి పండుగ సందర్భంగా పేల్చే బాణసంచా వల్ల పర్యావరణం కాలుష్యమవుతోందంటూ, దీన్ని నిషేధించాలంటూ ఎన్నో ఏళ్లుగా

By అంజి  Published on  3 Nov 2021 11:12 AM GMT
దీపావళి టపాసులను బ్యాన్‌ చేయొద్దన్న సద్గురు జగ్గీ వాసుదేవ్.!

దీపావళి పండుగ సందర్భంగా పేల్చే బాణసంచా వల్ల పర్యావరణం కాలుష్యమవుతోందంటూ, దీన్ని నిషేధించాలంటూ ఎన్నో ఏళ్లుగా పర్యావరణ వేత్తలు అంటున్నారు. అయితే కచ్చితంగా బాణసంచా కాల్చడం ఆపేయాలా.. అన్న విషయంపై ఇషా ఫౌండేషన్‌ స్థాపకులు, అధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. సద్గురు జగ్గీ వాసుదేవ్‌ మాట్లాడుతూ.. తాను కొన్నేళ్లుగా టపాసులు కాల్చడం లేదని అన్నారు. తన చిన్నప్పుడు ఈ దీపావళి పండుగ అంటే ఎంతో ప్రత్యేకమని.. పండగ వస్తొందంటే చాలు బాణసంచా పేల్చవచ్చని కలలు గనే వాళ్లమని అన్నారు. పండగ రోజు తర్వాత కూడా బాణసంచాను దాచుకొని మరో 2, 3 నెలలూ కాల్చేవాళ్లమన్నారు. పిల్లలను క్రాకర్స్‌ కాల్చకూడదని పర్యావరణంపై అవగాహన ఉండే తల్లిదండ్రులు ఎవరూ కూడా అనకూడదని, ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు.

బాణసంచా, టపాసులు కాల్చడంలో ఉండే ఆనందాన్ని పిల్లలు అనుభవించాలని, టపాసులు కాల్చకుండా ఉండేందుకు గాలి కాలుష్యం ఒక కారణం కాకూడదని సద్గురరరరు జగ్గీ వాసుదేవ్‌ అన్నారు. అయితే గాలి కాలుష్యంపై ఆందోళన చెందుతున్న వారికి తాను ఓ ప్రత్నామ్నాయ పరిష్కారాన్ని సూచిస్తానన్నారు. ఈ పండుగకి మీరూ మానేసి, మీ పిల్లలను టపాసులు కాల్చనివ్వాలని.. అంతేకాకుండా మీరు ఆఫీసు 3 రోజుల పాటు కారులో కాకుండా నడిచి వెళ్లాలని అన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్వీట్‌ చేశారు. ఇది కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాలుష్యానికి కారణమయ్యే వాటిలో టాప్‌ 10 లో కూడా దీపావళి లేదని ఓ నెటిజన్‌ సద్గురు వీడియో ట్వీట్‌కి కామెంట్‌ చేశారు.


Next Story