గుడ్‌న్యూస్.. మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.2100 జమ చేస్తాం..!
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు.
By Medi Samrat Published on 12 Dec 2024 8:50 AM GMTఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే పలు హామీలు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే మహిళల కోసం కూడా ఓ పెద్ద ప్రకటన చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి అతిషితో కలిసి అరవింద్ కేజ్రీవాల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ రెండు పెద్ద ప్రకటనలు చేశారు. ఎన్నికల తర్వాత రూ.1000 బదులు రూ.2100 మహిళల ఖాతాల్లోకి వస్తాయని కేజ్రీవాల్ తెలిపారు. రేపటి నుంచే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయని తెలిపారు.
కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఈరోజు రెండు పెద్ద ప్రకటనలు చేయడానికి వచ్చానని చెప్పారు. ఢిల్లీలోని ప్రతి మహిళ ఖాతాలో ప్రతినెలా రూ.1,000 జమ చేస్తామని ప్రకటించాను. నేను మార్చిలో ఈ ప్రణాళికను ప్రకటించాను.. ఈ పథకాన్ని ఏప్రిల్‌లో అమలు చేయాలన్నది మా వ్యూహం.. కానీ ఈ వ్యక్తులు మమ్మల్ని ఫేక్ కేసులో ఇరికించారు.. దాని కారణంగా ప్రణాళిక అమలు కాలేదన్నారు. ఎన్నికల తర్వాత రూ.1000 బదులు రూ.2100 మహిళల ఖాతాల్లోకి వస్తాయని కేజ్రీవాల్ తెలిపారు
అంతకుముందు ఉదయం ఢిల్లీ కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో మహిళా సమ్మాన్ యోజన ఆమోదించారు. దీని కింద ఢిల్లీలో నివసించే మహిళలకు నెలకు వెయ్యి రూపాయల మొత్తం లభిస్తుంది. 18 ఏళ్లు పైబడిన మహిళలు ఈ పథకానికి అర్హులు. వీరికి ఢిల్లీ ఓటరు గుర్తింపు కార్డు ఉండాలి. ఆదాయపు పన్ను డిపాజిట్లు దాఖలు చేసే మహిళలకు ఈ సౌకర్యం ఉండదు.