భారత్ కు రోమియో హెలీకాప్టర్లు అతి త్వరలో రాబోతున్నాయి

Romeo Helicopter For India. అమెరికా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్ లాక్ హీడ్ మార్టిన్ శుక్రవారం నాడు 'ఎంహెచ్-60 రోమియో'

By Medi Samrat  Published on  6 Dec 2020 10:19 AM GMT
భారత్ కు రోమియో హెలీకాప్టర్లు అతి త్వరలో రాబోతున్నాయి

అమెరికా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్ లాక్ హీడ్ మార్టిన్ శుక్రవారం నాడు 'ఎంహెచ్-60 రోమియో' ఛాపర్ కు సంబంధించిన ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. భారత జాతీయ పతాకం ఉన్న హెలీకాఫ్టర్ అది. రోమియో విమానం భారత్ కోసం సిద్ధమవుతోందని అందులో వెల్లడించారు. నేవీ డే సందర్భంగా భారత నేవీకి చెందిన ఎంహెచ్-60 రోమియో ఫస్ట్ లుక్ ను చూపించినందుకు చాలా గర్వంగా భావిస్తూ ఉన్నామని తెలిపింది.

"This #NavyDay, we are proud to share the first look of the #IndianNavy's #MH60R in all its glory. #RomeoForIndia," అంటూ లాక్ హీడ్ మార్టిక్ ఫోటోను ట్విట్టర్ లో పోస్టు చేసింది.లాక్ హీడ్ మార్టిన్ సంస్థతో ఎంహెచ్-60 రోమియో హెలీకాఫ్టర్లకు సంబంధించిన 2.6 బిలియన్ డాలర్ల డీల్ ను 2019లో కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా లాక్ హీడ్ సంస్థ 24 ఎంహెచ్-60 రోమియో హెలీకాఫ్టర్లను భారత్ కు ఇవ్వాల్సి ఉంది. ఈ ఎంహెచ్-60 రోమియో హెలీకాఫ్టర్ల ద్వారా సబ్ మెరైన్లను కూడా వేటాడవచ్చు. సముద్రాల్లో సెర్చ్-అండ్-రెస్క్యూ ఆపరేషన్స్ కోసం వీటిని వాడనున్నారు. సీ కింగ్ హెలీకాఫ్టర్ల స్థానంలో ఈ విమానాలను ఉపయోగించాలని భారత్ భావిస్తోంది.

ఈ మల్టీ-మిషన్ హెలీకాఫ్టర్ల ద్వారా సబ్ మెరైన్లు ఎక్కడ ఉన్నాయో కనుక్కోవడమే కాకుండా.. ఎక్కడికి పయస్తున్నాయో తెలుసుకుని.. దాడి చేసే విధంగా రూపొందించారు. అలాగే సర్ఫేస్ షిప్ ల మీద కూడా దాడి చేయొచ్చు.

శుక్రవారం నాడు అమెరికా కూడా 90 మిలియన్ డాలర్ల మిలిటరీ హార్డ్ వేర్, సర్వీస్ లను భారత్ కు అందించడానికి ఒప్పుకుంది. ఈ డీల్ లో భాగంగా భారత ఎయిర్ ఫోర్స్, భారత ఆర్మీ, నేవీ ట్రాన్స్ పోర్ట్ కు సంబంధించి అవసరమైన వస్తువులను అందించనుంది. అమెరికా-భారత్ మధ్య రక్షణ పరమైన సంబంధాలను ఈ డీల్ మరింత పటిష్టం చేయనుందని అమెరికా అభిప్రాయం పడింది. ఇటీవలి కాలంలో భారత్ అమెరికా మధ్య రక్షణ పరమైన సంబంధాలు మరింత మెరుగవుతూ వస్తున్నాయి.


Next Story
Share it