రోడ్లు కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలన్న రాజస్థాన్ మంత్రి

Roads should be made like Katrina Kaif's cheeks. కొత్తగా బాధ్యతలు చేపట్టిన రాజస్థాన్ మంత్రి రాజేంద్ర సింగ్ గూడా రాష్ట్ర రహదారులను

By Medi Samrat  Published on  24 Nov 2021 5:28 PM IST
రోడ్లు కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలన్న రాజస్థాన్ మంత్రి

కొత్తగా బాధ్యతలు చేపట్టిన రాజస్థాన్ రాష్ట్ర మంత్రి రాజేంద్ర సింగ్ గూడా రహదారులను నటి కత్రినా కైఫ్ బుగ్గలతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో వివాదాస్పదమైంది. ఆన్‌లైన్‌లో విస్తృతంగా షేర్ అవుతున్న వీడియోలో.. కాంగ్రెస్ ఎమ్మెల్యే తన అసెంబ్లీ నియోజకవర్గమైన ఉదయపూర్వతిలో ప్రజలతో మాట్లాడారు. గూడాకు తమ గోడు వెళ్లబోసుకుంటూ ఆ ప్రాంతంలోని రోడ్లను బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సమయంలో, మంత్రి మీటింగ్‌లో ఉన్న పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ చీఫ్ ఇంజనీర్ వైపు తిరిగి, "నా నియోజకవర్గంలో కత్రినా కైఫ్ బుగ్గల మాదిరిగా రోడ్లు వేయాలి" అని సరదాగా అన్నారు. అక్కడ ఉన్న వాళ్లు చప్పట్లు కొట్టడంతో ఆయన మరోసారి తన వ్యాఖ్యలను రిపీట్ చేశారు.

గతంలో కూడా పలువురు రాజకీయ నాయకులు రోడ్లను హీరోయిన్ల చెంపలతో పోల్చారు. రాజకీయ నాయకులు తమ ఆదర్శ రహదారులను నటీమణుల చెంపలతో పోల్చడం కొత్తేమీ కాదు. 2005లో ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ రోడ్లను హేమా మాలిని చెంపలలా నున్నగా చేస్తానని వాగ్దానం చేశారు. మధ్యప్రదేశ్ న్యాయ మంత్రి పిసి శర్మ 2019లో రాష్ట్రంలోని గుంతలతో ఉన్న రోడ్లను త్వరలో 'డ్రీమ్ గర్ల్'(హేమమాలిని) స్టార్ చెంపల్లా అందంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.


Next Story