ఈద్ సందర్భంగా రోడ్ల మీద నమాజ్ చేయకూడదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలను జారీ చేసింది. ముస్లింలు వీధుల్లో నమాజ్ చేయకూడదని తన ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమర్థించుకున్నారు, రోడ్లు ట్రాఫిక్ కదలిక కోసమే అని, ఇతర విషయాల కోసం కాదన్నారు. నేరాలు, విధ్వంసం, వేధింపులు లేకుండా భారీ మహా కుంభమేళాలో పాల్గొన్న హిందువుల నుండి మతపరమైన క్రమశిక్షణ నేర్చుకోవాలని ఆయన ముస్లింలకు సూచించారు. PTI కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, వక్ఫ్ (సవరణ) బిల్లును వ్యతిరేకించే వాళ్లను యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా విమర్శించారు.
విద్య, ఆరోగ్యం వంటి రంగాలలో హిందూ దేవాలయాలు, మఠాలు దాతృత్వానికి పాల్పడ్డాయని అన్నారు. ఏదైనా వక్ఫ్ బోర్డుకు ఎన్నో రెట్లు ఎక్కువ ఆస్తులు ఉన్నప్పటికీ ఇలాంటి సంక్షేమ పనులు చేశారా అని ఆయన ప్రశ్నించారు. మొత్తం సమాజం గురించి మర్చిపోండి, వక్ఫ్ ఆస్తులను ముస్లింల సంక్షేమం కోసమైనా ఉపయోగించారా అని ప్రశ్నించారు. వక్ఫ్ ఏదైనా ప్రభుత్వ ఆస్తిని స్వాధీనం చేసుకునే మాధ్యమంగా మారింది. ఈ సంస్కరణ ప్రస్తుత అవసరమని నమ్ముతున్నానన్నారు యోగి ఆదిత్యనాథ్.