రోడ్డు ప్రమాదాలతో భారత్‌కు రూ.2 లక్షల కోట్ల నష్టం.!

Road accidents in india. 2019 సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదాల కారణంగా భారత్‌ దాదాపు రూ.2 లక్షల కోట్లు నష్టపోయింది. ఇది దేశ జీడీపీలో

By అంజి  Published on  26 Oct 2021 3:21 AM GMT
రోడ్డు ప్రమాదాలతో భారత్‌కు రూ.2 లక్షల కోట్ల నష్టం.!

2019 సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదాల కారణంగా భారత్‌ దాదాపు రూ.2 లక్షల కోట్లు నష్టపోయింది. ఇది దేశ జీడీపీలో 0.55 - 1.35 శాతమని బాష్‌ ఇండియా అధ్యయనం పేర్కొంది. గత 20 ఏళ్లలో దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై బాష్‌ ఇండియా అడ్వాన్స్‌డ్ అటానమస్‌ సేఫ్టీ సిస్టమ్స్‌, కార్పొరేట్‌ రీసెర్స్‌ డిపార్ట్‌మెంట్‌లు ప్రత్యేక విశ్లేషణ జరిపాయి. కొత్త టెక్నాలజీతో నూతన ఉత్పత్తులు, బిజినెస్‌ ప్లాన్స్‌, రోడ్డు భద్రతా విధానాల రూపకల్పనకు ఈ అధ్యయనం తోడ్పుడుతుందని బాష్‌ ఇండియా వెల్లడించింది.

రోడ్డు ప్రమాదాల కారణంగా జరిగిన మానవ నష్టం, ఆర్థిక నష్టం, ఉత్పత్తి వ్యయం, గాయాలకు చికిత్స చేసినందుకు అయిన ఖర్చ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని మొత్తం నష్టాన్ని అంచనా వేశారు. రోడ్‌ యాక్సిడెంట్‌ శాంప్లింగ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ఇండియా వెయిటెడ్‌ డేటా ప్రకారం 2019లో 7,81,668 వాహనాలకు యాక్సిడెంట్‌ అయింది. ఇందులో వాహనాలకు రూ.13,500 కోట్ల నష్టం వాటిల్లింది. ఇక వాణిజ్య వాహనాలకు రూ.2,672 కోట్లు నష్టం, కార్లకు రూ.523, బైక్‌లకు రూ.142 కోట్లు, బస్సులకు రూ.300 కోట్ల నష్టం వాటిల్లింది. గాయాలైన వారి కోసం చికిత్సకు రూ.14,400 కోట్లు ఖర్చయ్యాయి.

Next Story